నేడే అయోధ్య తీర్పు

Today Ayodhya verdict

అయోధ్య వివాదంపై తుది తీర్పు వెలువడనుండటం దేశ వ్యాప్తంగా నేడు ఆసక్తి నెలకొన్న అంశం . దశాబ్దాల తరబడి దేశంలో అనేక సంఘటనలకు, తీవ్రస్థాయి రాజకీయ పరిణామాలకు కారణమైన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు నేడు  తుది తీర్పు వెలువరించనుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ రోజు  ఉదయం 10.30 గంటలకు తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 17న  రంజన్ గొగోయ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపే అత్యంత ముఖ్యమైన అయోధ్య తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే మునుపెన్నడూ లేనంత వేగంగా కొన్నిరోజులుగా ఇరుపక్షాల వాదనలు వినడం పూర్తి చేసి అంతిమ తీర్పుకు కసరత్తులు చేశారు.అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలోని సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఒక్క అయోధ్యలో భద్రత కోసమే 4,000 మంది పారామిలిటరీ సిబ్బందిని తరలించారు. తాజాగా  యూపీ సర్కారు కదలికలు అయోధ్య తీర్పు త్వరగా వస్తుందన్న అంచనాలను బలపరిచాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో యూపీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి మరీ శాంతి భాదరతల అంశాన్ని పరిశీలించారు. మొత్తానికి దశాబ్దాలుగా హిందూ ముస్లిం పక్షాల మధ్య నలుగుతున్న ఈ వివాదానికి నేటి తీర్పుతో తెర పడనుంది .
tags : Ayodhya verdict, Supreme Court, central government,  Ranjan Gogoi, Chief justice of india

ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలివే

ఆర్టీసీలో ప్రైవేటీకరణపై పిటీషన్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *