today last day for nominations
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. రెండు రోజుల్లో మొత్తం 537 మంది 597 సెట్ల నామినేషన్ల దాఖలయ్యాయి. మొదటిరోజు 17 మంది 20 సెట్ల నామినేషన్లు, రెండో రోజు 520 మంది 577 నామినేషన్ల దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే టీఆరెఎస్ 195, బీజీపీ 140, కాంగ్రెస్ 68, ఎంఐఎం 27, సీపీఐ 1, సీపీఎం 4 మంది నామినేషన్ల దాఖలు. మరి, ఈ రోజు మరెంత మంది నామినేషన్లు వేస్తారో రాత్రి వరకూ పూర్తి లెక్క తేలుతుంది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే జరుగుతుందన్న విషయం అర్థమవుతోంది. దుబ్బాక గెలుపుతో బీజేపీ తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా పూర్తిస్థాయిలో ప్రకటించలేదు.దీంతో టికెట్లు ఆశిస్తున్నవారు ముందస్తుగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 125 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 25 డివిజన్లకు ఇవాళ తమ అభ్యర్థుల జాబితను విడుదల చేయనుంది. అదేవిధంగా 44 సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించింది. దీంతో ఈ స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ప్రకటించనుంది.