టోక్యో ఒలంపిక్స్ వాయిదా

TOKYO OLYMPICS ONE YEAR DELAY

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా వైరస్ మానవాళి మీద తన ప్రతాపం చూపిస్తుంది. ఇక కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకు పెరుగుతుండ‌టంతో ప్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలిపింక్స్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలిన నేపథ్యంలో చివరి నిమిషంలో జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఎలాగైనా అనుకున్న సమయానికి ఒలింపిక్స్ నిర్వహించాలని మొదట్లో అనుకున్నప్పటికీ కరోనా తీవ్రత పెరగడంతో వాయిదా వేయక తప్పలేదు. జపాన్ సైతం దీనిపై చాలా ఖర్చు చేసింది. అయితే ఊహించని రీతిలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతుండటంతో జపాన్ వెనక్కి తగ్గక తప్పలేదు.
కరోనా నేపధ్యంలో జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలంపిక్స్ ను వాయిదా వేసింది. ఒక ఏడాది పాటు ఒలంపిక్స్ ను వాయిదా వేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఈ ఏడాది ఒలంపిక్స్ జరగాల్సి ఉంది. అయితే ఒక దశలో ఒలంపిక్స్ ను జరపాలని నిర్ణయించింది. అయితే రోజు రోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఒలంపిక్స్ ను వాయిదా వేయక తప్పలేదు. అయితే కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతుండటంతో అన్ని దేశాలు షట్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏ దేశం నుంచి పార్టిసిపేషన్ ఉండదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంది .

tags: tokyo olympics, japan , corona virus, corona effect , japan government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *