కార్యకర్తల రక్షణ కోసం టోల్‌ఫ్రీ

Spread the love

Toll Free Number For TDP Leaders

కార్యకర్తల రక్షణ కోసం టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమరావతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయన్నారు. గత 15 రోజులుగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులు ప్రాధాన్య క్రమంలో పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. నిర్మాణం చివరి దశకు వచ్చిన సమయంలో ఇప్పుడు వాటిని రద్దు చేస్తున్నారని విమర్శించారు.అవగాహన లేకుండా పోవడం.. చెప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురద జల్లడమే వైసీపీ త్రిసూత్రంగా పెట్టుకుందని బాబు ఎద్దేవా చేశారు.

* టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ, దీనిపై విచారణ జరిపిస్తామని చెబుతోంది. సాగునీటి ప్రాజెక్టుల పనులను విచారణ పేరుతో నిలిపివేయడమంటే…రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతల అంతర్గత సమావేశంలో పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రభుత్వానికి స్పష్టం చేయాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తెలిసిందే.

tdp latest news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *