కాజల్ పెళ్లి ఫిక్సు

2
#KajalAggarwal, #KajalAgarwal, #KajalAgarwalMarriage,#KajalAgarwalMarriageWithGautam
#KajalAggarwal, #KajalAgarwal, #KajalAgarwalMarriage,#KajalAgarwalMarriageWithGautam

Tollywood Heroine kajal will get marriage

టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. కాజల్ పెళ్లి గురించి గతంలో చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా కాజల్‌ అగర్వాల్‌ ముంబైకి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్తను‌ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా కాజల్‌ పెళ్లాడబోతోన్న వ్యక్తి పేరు కూడా బయటికి వచ్చేసింది. ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ వివాహం చేసుకోనుందని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీనిపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ అక్టోబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

ఇప్ప‌టికీ ఈమె చేతిలో చాలా సినిమాలున్నాయి. ప్రస్తుతం త‌మిళ‌నాట కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. శంకర్ సినిమా కాబట్టి క‌చ్చితంగా మ‌రో ఏడాది పాటు అక్క‌డే లాక్ కావ‌డం ఖాయం. దాంతోపాటు చిరంజీవి ఆచార్యలో కూడా నటిస్తుంది.