Tomorrow Save RTC Rallies AT Depots
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించనున్నట్లు ప్రకటన చేసిన ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మిక జేఏసీ మరోమారు యూటర్న్ తీసుకుంది. సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులకు డిపో వద్దకు వెళ్లవద్దని అశ్వద్ధామ రెడ్డి పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కార్మికుల పట్ల సానుకూల వైఖరి లేదని అశ్వద్ధామ రెడ్డి ఆరోపించారు. ఇక అంతే కాదు సేవ్ఆర్టిసి పేరుతో ర్యాలీలు నిర్వహిస్తామని అశ్వత్థామరెడ్డి. శనివారం సేవ్ ఆర్టిసి పేరుతో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేసిన అశ్వద్ధామ రెడ్డి, ప్రస్తుత ప్రభుత్వ వైఖరి వల్ల తాము సమ్మెను కొనసాగించ వస్తుందని స్పష్టం చేశారు. శనివారం కార్మిక చేసి మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఇక మరోమారు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎలా సాగుతుందో, సీఎం కేసీఆర్ ఈ సమ్మెపై ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.