వరద పోటెత్తుతుంటే బోటును ఎలా అనుమతించారు?

Tourism Boat Drowned In Godavari

గోదావరిలో వరద పోటెత్తుతుంటే బోటును ఎలా అనుమతించారు? నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ పర్యాటకులను ఎలా అనుమతించారు? దీని బట్టి టూరిజం, జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేనట్లు అనిపిస్తుంది. వరద ఉద్ధృతితో పరవళ్లు తొక్కుతున్న గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ అనే లాంచీ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు తెలంగాణ వాసులు కూడా ఉన్నట్టు తెలిసింది.  22 మంది హైదరాబాదీలు, 14 మంది వరంగల్ కు చెందినవారు కూడా ఈ బోటులో ఉన్నారు. అయితే వరంగల్ కు చెందినవారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, 9 మంది గల్లంతయ్యారు. హైదరాబాద్ వాసుల పరిస్థితి తెలియరాలేదు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంలో 61 మందితో ప్రయాణిస్తున్న లాంచీ మునిగిపోయింది. ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు గుర్తించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

చంద్రబాబు దిగ్భ్రాంతి

పర్యాటక పడవ మునక పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వద్ద దుర్ఘటన దురదృష్టకరమన్నారు. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు,సిబ్బంది ప్రమాదానికి గురి కావడం బాధాకరమని తెలిపారు. జిల్లా యంత్రాంగం యుద్దప్రాతిపదికన వెంటనే స్పందించాలి. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి. కచ్చలూరు పడవ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి చెందామన్న బాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *