కొనసాగుతున్న త్రిసభ్యకమిటీ విచారణ

TREESABYA COMMITTEE ON INTERS RESULTS

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై అగ్రహ జ్వాలలు మిన్నుముడుతున్నాయి. మూడోరోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. మూడోరోజు ఆందోళనలకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. బోర్డు కార్యదర్శి అశోక్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు జరుపుతున్నారు. విద్యార్థుల అరెస్టులు, రాజకీయ నేతల సంఘీభావం, విద్యార్థి సంఘాల నినాదాలు బోర్డు కార్యాలయం హోరెత్తుతున్నాయి.

25న కలెక్టరేట్ల ముందు ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇంటర్ బోర్డు వైఫల్యంపై నేతలు సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. బోర్డు తీరుపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, చీఫ్ విప్ భట్టి విక్రమార్క లేఖ రాశారు. బోర్డు వైఫల్యానికి బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు , బోర్డు కార్యదర్శి అశోక్‌ను తొలగించించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారించింది. బోర్డు కార్యదర్శి అశోక్‌తో పాటు, గ్లోబరీనా సంస్థ సీఈవో రాజులను ప్రశ్నించింది. గ్లోబరీనా సంస్థ లోపాలు, బోర్డు వ్యవహరించిన తీరుపై కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈమేరకు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *