త్రిషకు ఉన్న ధైర్యం హీరోలకు లేదా..?

trisha dont scare corona

త్రిష.. సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన వెలుగుతోన్న బ్యూటీ. కొత్తతరం భామలు ఎంతమంది వచ్చినా.. త్రిష హవా తగ్గలేదు. కాకపోతే స్టార్ హీరోల సినిమాల్లో  కాస్త ఛాన్సులు తగ్గాయి. అయితేనేం.. తన స్టార్డమ్ మాత్రం తగ్గలేదు అనేందుకు తను ఇప్పుడు చేస్తోన్న సినిమాలే ఎగ్జాంపుల్. తమిళ్,మళయాలంలో కలిపి అరడజనుకు పైగా  సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు 35యేళ్లు దాటినా.. పదిహేనేళ్ల క్రితం ఫిజిక్ నే మెయిన్టేన్ చేస్తూ న్యూ ఏజ్ బ్యూటీస్ కు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ కథలకు ప్రియారిటీ ఇస్తోన్న త్రిష.. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ జాయిన్ అయింది. యస్.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తను మళ్లీ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎంటైర్ కోలీవుడ్ కే షాక్ ఇచ్చింది. మళయాలంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న ‘రామ్’చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది త్రిష. కరోనా వల్ల అనేక ఆంక్షలు ఉన్నా.. వాటి మధ్యే తనూ షూటింగ్ కు వెళుతూ ప్రతి ఒక్కరినీ ఛాలెంజ్ చేస్తోందనే చెప్పాలి. ఒక వైపు స్టార్ హీరోలు, హీరోయిన్లంతా షూటింగ్ లకు వెళ్లడానికి భయపడుతోంటే త్రిషమాత్రం అవేవీ లెక్క చేయకుండా వెళ్లడం కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. ఇప్పటికే కొన్ని టివి సీరియల్స్ లో షూటింగ్ టైమ్ లోనే కరోనా పాజిటివ్ కేస్ లు బయటపడ్డాయి.

ఇవి దేశమంతా తెలిసిన విషయాలే అయినా త్రిష పట్టించుకోవడం లేదంటే తన ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే త్రిష పాటి ధైర్యం మన స్టార్ హీరోలు చేయకపోవడం బాధాకరం. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. ఏ పనీ ముందుకు వెళ్లదు. ఈ విషయంలో స్టార్లు అంతా సర్దుకున్నాక వస్తే.. అప్పటి వరకూ చిన్న నటులు సమిధలు కావాలనా లేక.. అసలు మనకెందుకు షూటింగ్ లు అనుకుంటున్నారని అనుకోవాలా..? ఏదేమైనా ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లోనూ, అన్ని వర్గాల్లోనూ ఈ భయం ఉంది. అలాగని ఎవరూ తమ పనులు ఆపుకోలేదు కదా. మరి షూటింగ్ లే ఎందుకు ఆపుతున్నారు అంటే.. అది అతి జాగ్రత్త అనుకోవాలా లేక.. అక్కడ ఏమైనా జరిగితే అందరికీ చాలా వేగంగా తెలిసిపోతుంది కాబట్టి అనుకోవాలా..? ఎవరి భయాలు వాళ్లకు ఉన్నాయి. కానీ ఆ భయాన్ని జయించి.. త్రిషలా ఇంకెంతమంది స్టార్స్ ముందుకు వస్తారో చూడాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *