నితిన్ కోసం వస్తోన్న గురూజీ

Trivikram Guest for Nithin Bheeshma Pre Release Event

యంగ్ స్టార్ నితిన్ చాలా జోష్ గా కనిపిస్తున్నాడు. అతని లేటెస్ట్ మూవీ ‘భీష్మ’పై అన్ని వర్గాల్లోనూ పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. దీనికి తోడు ఈ మూవీ నుంచి ప్రమోషనల్ గా విడుదలైన ప్రతి వీడియో సూపర్ అనే టాక్ తెచ్చుకుంటోంది. ఈ వేలైంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన రెండు నిమిషాల పాట కూడా సూపర్బ్ అనే టాక్ తెచ్చుకుంది. నితిన్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించిన ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన భీష్మలో హీరోయిన్ రష్మిక మందన్నా పాత్ర హైలెట్ అవుతుందని కూడా వినిపిస్తోంది. ఇక ఈ నెల 21న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అంటే త్రివిక్రమ్ కు సెకండ్ హోమ్ బ్యానర్ లాంటిది. అదేటైమ్ లో ఈ బ్యానర్ లోనే నితిన్ కు కెరీర్ బెస్ట్ హిట్ ‘అ ఆ’ఇచ్చాడు. అప్పటి నుంచి త్రివిక్రమ్, నితిన్ మధ్య మంచి రాపోనే ఉంది. మరోవైపు భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల కూడా త్రివిక్రమ్ వద్ద పనిచేసి ఉన్నాడు. ఈ అన్ని కారణాలతోనే ఈ నెల 17న(సోమవారం) జరిగే భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నాడట.

Trivikram Guest for Nithin Bheeshma Pre Release Event,Director Venky Kudumula,Nithin Bheeshma,Bheeshma Movie Release,Nithin Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *