వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?

Trivikram with Venky and Nani

వెంకటేష్ తర్వాత తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ లో అంత క్రేజ్ ఉన్న స్టార్ అంటే నానినే చెప్పాలి. నేచురల్ స్టార్ గా తనకంటూ తిరుగులేని ఫ్యాన్స్ తో పాటు ఓ ఇమేజ్ కూడా సంపాదించుకున్న నాని తెలుగులో మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. అతను ఎంచుకునే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే అతనికి స్టార్ హీరోల ఫ్యామిలీల్లో కూడా ఫ్యాన్స్ ఉండటం విశేషం. మొత్తంగా నాని ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో అతను వెంకటేష్ తో కలిసి త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనే మాట టాలీవుడ్ లో సరికొత్తగా వినిపిస్తోంది. మరి ఇది నిజమవుతుందా అనేదే పెద్ద ప్రశ్న. మరోవైపు వెంకటేష్ తమిళ్ సూపర్ హిట్ అసురన్ రీమేక్ నారప్పలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఇంకా 30శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది. తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేదానికి క్లారిటీ లేదు. ఇక ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయి ఉంది. అయితే ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో లాక్ అయిపోయాడు.

ఆ మూవీ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకూ త్రివిక్రమ్ వేచి చూడాలి. లేదంటే మరో సినిమా చేయాలి. అందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా అనేది పక్కన బెడితే త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా కన్ఫార్మ్ అయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అనే మాట ఆసక్తి రేకెత్తిస్తోన్నా.. అది సాధ్యం అనేందుకు ఆధారాలు కనిపించడం లేదు. నాని ‘వి’విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ ఎత్తేశాక కొన్ని రోజుల షూటింగ్ తో పూర్తవుతుంది. తర్వాత రాహుల్ సాంకృత్యన్ తో ‘శ్యామ్ సింగరాయ్’అనే మూవీ ఉంది. ఇవన్నీ వరుసగా రాబోతోన్న చిత్రాలే. అంటే మూడు సినిమాలు పూర్తయ్యాక కానీ నాని ఖాళీ అవడు. ఈ లోగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అయిపోతుంది. అప్పుడు త్రివిక్రమ్ ఖాళీగా ఉండడు. ఒకవేళ త్రివిక్రమ్ కోసం ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి ఆపితే తప్ప ఈ క్రేజీ కాంబినేషన్ సాధ్యం కాదు. ఏదేమైనా కొన్ని రూమర్స్ నిజమైతే బావుండు అనిపిస్తుంది. అలాంటిదే ఇది కూడా అని ఇప్పటికి అనుకోవడం తప్ప ఇది నిజం అని నమ్మలేని పరిస్థితి ఉందని మాత్రం చెప్పొచ్చు.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *