మోడీకి ఓటేస్తే మోరీల ఏసినట్లే

5
TRS ATTACK ON BJP
TRS ATTACK ON BJP

TRS ATTACK ON BJP

బీజేపీ ఇచ్చిన ఉద్యోగాలెన్ని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏడాది కి 3 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పింది ఇచ్చిందా? వంద రోజుల్లో నల్లా ధనాన్ని ఇండియా కి తెచ్చి, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. వేశారా? పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన బీజేపీ కి ఓటు వేద్దామా? ఉద్యోగాలు ఇవ్వని బీజేపీ కి అవకాశం ఇద్దామా అంటూ నినదిస్తున్నారు. ఈ మధ్య దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన బీజేపీ, తెలంగాణ కు ఒక్క కాలేజీ కూడా ఎందుకు ఇవ్వలేదు? చివరకు బీజేపీ ఎంపీలు ఉన్న నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ లకు కూడా ఎందుకు ఇవ్వలేదు? మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని తొండి సంజయ్, పసుపు బోర్డు తెచ్చుకోవడం చేత గాని గుండు అరవింద్ లు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. దమ్ము లేని దద్దమ్మలు. చేత గాని చవటలు.

కాజీపేట కు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. కోచ్ ఫ్యాక్టరీ కి ఆలస్యంగా భూమి ఇచ్చామనడం తప్పు. ఉమ్మడి రాష్ట్రం లో అప్పటి పాలకులు ఆలస్యం చేసి ఉండవచ్చు. కానీ తెలంగాణ వచ్చిన వెంటనే, కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నిస్తుంటే, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 150 ఎకరాలు కావాలని అడిగితే, 150.05 ఎకరాలు ఇచ్చాం. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ యోచన లేదని బీజేపీ అంటున్నది. కోచ్ ఫ్యాక్టరీ సాధించేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని వరంగల్ నాయకులు ప్రతినబూనారు.

అన్నీ ప్రైవేట్ పరం చేస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారు? అదానీ, అంబానీ లకు అంతా అప్పగిస్తే, దేశాన్ని బీజేపీ ఏమి చేయాలని భావిస్తున్నది. కరెంట్ ను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే, రైతుల గతి ఏమవుతుంది? రైతుల భూములు కూడా ప్రైవేటుకు అప్పగిస్తారట. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే, మోడీ దేశంలో వ్యవసాయాన్ని దండుగ చేస్తున్నారు. అందుకే బిజెపి మోడీ కి ఓటు వేస్తే.. మోరీల వేసినట్లేననే విమర్శిస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసించిందుకు పార్లమెంటులో నిరసించినందుకే కేంద్రం రాష్ట్రం పై పగ పట్టింది. పథకాలను, పైసలు ఇవ్వడం లేదు. కేవలం రైతుల కోసం మాట్లాడటమే తప్పా? ఇంత వివక్ష చూపిస్తున్న బీజేపీ కి ఓటు వేద్దామా అంటే ప్రశ్నిస్తున్నారు. కనీస మద్దతు ధర లేకుండా రైతుల నుండి వారి పంటలను ఎలా కొనుగోలు చేస్తారు? కనీసం ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు బుద్ధి లేకుండా బండి, గుండు మాట్లాడుతున్నారు. మన పట్ల, మన రాష్ట్రం పట్ల మన సీఎం కేసీఆర్ కి ఉండే ప్రేమ, ఆర్తి బీజేపీ కి ఉంటుందా అంటూ ప్రశ్నించారు.

TELANGANA MLC ELECTIONS 2021