తెలంగాణా లో టీఆర్ఎస్ దే హవా అని తేల్చిన ఎగ్జిట్ పోల్స్

Spread the love

TRS IS IN TOP IN TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు 14 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటుందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు.ఆదివారం నాడు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను విడుదల చేశారు.ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఫలితాలను లగడపాటి రాజగోపాల్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సున్నా నుండి రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఎంఐఎం కు ఒక్క సీటు దక్కుతోందన్నారు. టీఆర్ఎస్ కు 14 నుండి 16 సీట్లు కూడ దక్కే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.

తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కాంగ్రెసు పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణాలో ఫలితాలు ఈవిధంగా ఉండబోతున్నట్లు ఇండియా టుడే సంస్థ ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం టిఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 10 నుంచి 12 స్థానాలు గెలుచుకోనున్నట్లు ప్రకటించారు. బిజెపి 1-3 స్థానాలు , అలాగే కాంగ్రెస్ 1-3 స్థానాలు , ఇతరులు 1 స్థానం గెలుచుకోవచ్చని సర్వే ఫలితాలలో వెల్లడించారు. టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సర్వేలో టీఆర్ ఎస్ కి 13 కాంగ్రెస్ కు 2, ఎంఐఎం కి 1, బీజేపే కి ఒక స్థానం దక్కుతుందని వెల్లడించారు. ఇక ఎన్డీటీవీ సర్వేలో టీఆర్ ఎస్ కి 12, కాంగ్రెస్ కి 2, ఎంఐఎం కి 2, బీజేపీకి ఒక స్థానం వచ్చే అవకాశం వుందని వెల్లడించింది. సీ-ఓటర్‌ సర్వేలో టీఆర్ఎస్ కి 14, కాంగ్రెస్ కి 1, బీజేపీ కి 1, ఎంఐఎం కి 1 స్థానం దక్కే అవకాశం ఉందని ప్రకటించింది. మొత్తానికి తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దే హవా అని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *