టికెట్ రాలేదన్న మనస్తాపంతో టీఆర్‌ఎస్‌ నేత సూసైడ్

TRS Leader Attempt To Suicide In Suryapet

టిక్కెట్‌ రాలేదనే కారణంతో టీఆర్‌ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేటలో జరిగింది. తెలంగాణాలో మున్సిపల్‌ ఎన్నికల పోరు హాట్ హాట్ గా జరగనుంది. ఇక టికెట్ల కోసం ఎదురుచూసిన ఆశావహులు రెబల్స్ గా బరిలో దిగుతున్నారు. ఎవరికీ వారు సొంతంగా నామినేషన్లు వేస్తున్నారు. దీంతో తెరాస పార్టీకి ఈ అంశం పెద్ద తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నేతలే ఇలా చేస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో టీఆర్‌ఎస్‌ నేత అబ్ధుల్‌ రహీం తన నివాసంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అదే వార్డు నుంచి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మొరిశెట్టి సుధారాణికి టికెట్ ఖరారు కాగా తనకు టికెట్ రాలేదన్న కారణంతో రహీం ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాలడ్డారు. అయితే సమయానికి చుట్టుప్రక్కల వారు ఘటనను అడ్డుకున్నారు.దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మొత్తానికి తెరాస పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ మున్సిపల్ ఎలెక్షన్స్ హాట్ హాట్ గా సాగనున్నాయి.

TRS Leader Attempt To Suicide In Suryapet,Abdul Raheem,Upset,municipal elections,#Suryapet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *