టీఆర్ఎస్ లో వర్గపోరు

2
TRS Leaders Fighting
TRS Leaders Fighting

TRS Leaders Fighting

పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను ఇబ్బడిముబ్బడిగా చేర్చుకుంది గులాబీ పార్టీ. నామినేటేడ్ పదవులు, ఇతర పదవులు దక్కుతాయని ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ లో చేరారు. ఆశపడి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదు. పార్టీలో ఓవర్ లోడ్ ఎక్కువై కొట్టుకునే స్థాయికి వెళ్లింది.

తాజాగా హైదరాబాద్ గోషామహల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ సమావేశం జరిగింది. అంతర్గతంగా ఉన్న ఈ కుమ్ములాట హోంమంత్రి ముందే కొట్టుకునే స్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారింది. తనను వేదికపైకి మీదకు పిలవలేదని ఓ నాయకుడు ప్రశ్నించడంతో, అక్కడున్న మరికొంత మంది నాయకులు అతడిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. అందరూ చూస్తుండగా, ఇరువర్గాల వారు దాడులు చేసుకున్నారు. దీంతో సుమారు గంటపాటు రోడ్డుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాయకులు, పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఇరువర్గాలు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. చివరగా పార్టీ పెద్దల ఆదేశాలతో ఇరువర్గాల వారు రాజీ పడ్డారు.

నియోజకవర్గంలో కొంతకాలంగా నాయకుల మధ్య వర్గ పోరు నెలకొంది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంతేకాదు…గ్రేటర్ లో కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు సఖ్యత కూడా లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుసార్లు మందలించినా టీఆర్ఎస్ తీరు మారడం లేదు.