దుబ్బాక ఓవర్.. తర్వాత జీహెచ్ఎంసీ?

9
BJP WON DUBBAKA
BJP WON DUBBAKA

BJP Won in Dubbaka

ఎట్టకేలకు అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి ఝలక్ ఇచ్చింది. నరాలు తెగే ఉత్కంఠలో సాగిన ఈ పోరులో ముఖ్యమంత్రి కేసీఆర్కు షాక్ ఇచ్చింది. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు సమీప ప్రత్యర్థి సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతపై 1470 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో, బీజేపీ శ్రేణులకు తెలంగాణలో మళ్లీ పట్టు సాధించే అవకాశం లభించింది. ఈ గెలుపు ఊపుతో బీజేపీ పార్టీ మరింత ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈసారి ఎలాగైనా జీహెచ్ఎంసీలో పాగా వేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. 

దుబ్బాకలో కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీగా పోరాటం కొనసాగుతుంది. 21 రౌండ్లు పూర్తి అయ్యే సరికి బీజేపీ మళ్లీ 620 ఓట్ల లీడ్ సాధించింది. అయితే, పద్దెనిమిది రౌండ్ల వరకూ ఆధిక్యంలో ఉన్న బీజేపీ 19వ రౌండు వచ్చేసరికి వెనకపడింది. 20వ రౌండ్ లో పుంజుకున్నది.

16, 17 వ రౌండ్ లలో 1550 ఓట్ల ఆధికత్య టీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. 15 రౌండ్లు ముగిసేసరికి బీజేపీకీ మొత్తం 2,483 ఓట్ల ఆధిక్యం లభించింది. బీజేపీకి మొదటి రౌండులో 341 ఓట్ల ఆధిక్యత రాగా.. రెండో రౌండులో 279 ఓట్ల ఆధిక్యతను సంపాదించింది. మూడో రౌండ్ లో  బీజేపీ అధిక్యం 750కి చేరింది. నాలుగో రౌండ్లో 1,425 లీడ్ లభించింది. ఆరో రౌండ్ వచ్చేసరికి టీఆర్ఎస్ కి ఆధిక్యం పెరిగింది.  సుజాతకు ఆరో రౌండులో 4,062 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 3,709 ఓట్లు పోలయ్యాయి.  ఏడో రౌండు వచ్చేసరికి తెరాసకు 182 ఓట్ల లీడ్ లభించింది. మరి, ఇదే ట్రెండ్ చివరి వరకూ కొనసాగుతుందా? లేదా? అనే ఉత్కంఠ టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల్లో నెలకొన్నది. చివరి రౌండు వచ్చేసరికి తమకే గెలుపు లభిస్తుందని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

* ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం అయిన పోతారంలో బీజేపీ 110 ఓట్ల మెజార్టీ సంపాదించడం ఆశ్చర్యకరం. దీని బట్టి అధికార టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా? అనే సందేహం కలుగుతుంది. లేదా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలి నచ్చక అక్కడి స్థానికులు బీజేపీకి ఓటేసి ఉండవచ్చు.

దుబ్బాక టౌన్, మండలంలో ఆధిక్యత కనబర్చిన బీజేపీ. ఆరో రౌండ్ లో టిఆర్ఎస్ ఆధిక్యం, దుబ్బాక మండలం చిట్టాపూర్ సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామంలో 846 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్, బీజేపీ 406 ఓట్లు. కొనసాగుతున్న ఏడో రౌండ్.. మిరుదొడ్డి మండల ఈవియంల లెక్కింపు

DubbakaLiveResults