TRS MAY WIN 45 SEATS
ప్రతిపక్షాలు బలం పెరగకముందే.. బలపడకముందే చిత్తు చేయాలన్నది అధికార పార్టీ ఆలోచన అనుకుంటా. అందుకే, ఎంతో తొందరపడి రెండు వారాల్లోపే జీహెచ్ఎంసీ ఎన్నికల్ని నిర్వహిస్తోంది. అసలే ఓట్లు వేయడానికి నిర్లక్ష్యం చూపెట్టే ప్రజలకు ఇంత తక్కువ వ్యవధినిస్తే ఎలా ఓటు వేస్తారనేది కూడా ప్రశ్నే. బహుశా అధికార పార్టీకి కావాల్సింది కూడా ఇదే అనుకుంటా. గతంలో ఎన్నడూ జీహెచ్ఎంసీ ఎన్నికల్ని పదిహేను రోజుల్లో నిర్వహించిన దాఖలాల్లేవు. ఇలా తొందరగా ఎన్నికల్ని నిర్వహించడానికి కారణమేమిటని హైదరాబాద్ వాసులు ఆశ్చర్యపోతున్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీలను నిరోధించడానికే అధికార పార్టీ ఇంత త్వరగా ఎన్నికలను నిర్వహిస్తుందనే విషయాన్ని చిన్న పిల్లాడికీ అర్థమవుతోంది. దీంతో, అసలుకే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రజాస్యామ్యం అంటే అధికార పక్షానికి ఇంత పరిహాసమా? అంటూ విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌ని నిజంగా అభివ్రుద్ధి చేయడానికి మరో ఐదేళ్లు పడుతుంది, కాబట్టి అవకాశం ఇవ్వాలని కోరుకుంటే ప్రజలు తప్పకుండా అర్థం చేసుకుని సహకరించేవారేమో. కానీ, ఇలా అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని పదిహేను రోజుల్లో ఎన్నికలను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని పలువురు ఉద్యోగులు అంటున్నారు. ఇలా, అధికార దుర్వినియోగాన్ని చేసే పార్టీకి తప్పకుండా తమ ప్రతాపాన్ని చూపిస్తామని చెబుతున్నారు. మొత్తానికి, టీఆర్ఎస్ పార్టీ తమ ఓటమిని తామే కోరి తెచ్చుకున్నట్లు ఉందని మరికొందరు ప్రజలు భావిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లలో అధిక శాతం మందికి మంచి పేరు లేదు. అభ్యర్థుల్ని గనక మార్చకపోతే, వాళ్లు గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే, గత ఐదేళ్లలో అధిక శాతం మంది కార్పొరేటర్లు ప్రజల్ని పట్టి పీడించేశారు. అందుకే, ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. మళ్లీ టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. కాబట్టి, టీఆర్ఎస్ కు ఓటేయడమే కరెక్టు అని అంటున్నారు. టీఆర్ఎస్ కు బలమైన ప్రతిపక్షం బీజేపీ అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. తమ పూర్తి మద్ధతు బీజేపీ అభ్యర్థులకే అంటున్నారు. గతంలో 99 సీట్లు గెల్చుకున్నవారిలో కనీసం యాభై శాతానికి పైగా ఓడిపోయే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు ఈసారి 45 సీట్లు రావడం మహా ఎక్కువ అని భావించేవారి సంఖ్య తక్కువేం కాదు. మొత్తానికి, బీజేపీ ఎంత బలంగా గేమ్ ఆడుతుందనే విషయం మీద టీఆర్ఎస్ గెలుపు ఆధారపడుతుంది.