అధికార పార్టీ వైపు మొగ్గు..

6

HYD-RR-MBNR
చివరి గంటల్లో హైదరాబాద్ – మహబూబ్‌నగర్ గ్ర్యాడుయేట్‌లు వాణీదేవీ వైపు మొగ్గుచూపారని టాక్. హైదరాబాద్, రంగారెడ్డిలలో రామచంద్రరావుగారి సొంత బ్యాంక్‌కు ఢోకా రాలేదు కానీ రెండో ప్రయారిటీ ఓట్ అంటూ ఏర్పడ్డ అవగానలో చిన్నారెడ్డి గారి వల్ల బిజేపి ఓట్ బ్యాంక్‌కు డ్యామేజ్ జరిగిందనే చెప్పుకోవాలి. చిన్నారెడ్డి గారి ఇలాఖా ఇటు నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్ నుంచి జడ్చర్ల వరకూ కాంగ్రెస్ మద్దతుదార్లయిన గ్ర్యాడుయేట్లు చిన్నారెడ్డికి మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. జోగులాంబ, అచ్చంపేట్ ప్రాంతాల్లో గులాబీ హవా కనిపించింది. ఇక ఈ ప్రాంతం నుంచి (MBNR) నారాయణ్‌పేట్, కల్వకుర్తి, మహబూబ్‌నగర్ ఓట్లు రామచంద్రరావు, వాణీదేవీలకు సమానంగా పడ్డట్టు అంచనా. హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్, మిడిల్ క్లాస్ ఓట్లు బిజేపికి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మొగ్గు చూపితే.. రూరల్, లోయర్ వర్కింగ్ క్లాస్ ఓట్లు టీయారెస్‌కి పడ్డాయని అంచనా. ఇంతకు ముందు ఎన్నడూ లేనంత పోలింగ్ నమోదైంది కాబట్టి పోల్ మేనేజ్‌మెంట్‌ను కూడా కీలకంగా పరిగణించాలి. ఈ విషయంలో ఓటర్ల మొబిలైజింగ్, పోల్ ఆర్గనైజింగ్‌ను కాంగ్రెస్ బిజేపిల కన్నా టీయారెస్ బాగా నిర్వహించింది. దీంతో వాళ్ళు పూల్ చేసుకున్న సంఖ్య యాక్చువల్ పోలింగ్ కన్నా ఎక్కువే అనుకోవచ్చు.
చివరి క్షణంలో సేకరించిన సమాచారంలో వాణీదేవీకే అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి.
దీంతో ఆమెతో పాటు రామచంద్ర రావు మొదటి స్థానంలో పోటాపోటీగా ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ / చిన్నారెడ్డిలు మూడు నాలుగో స్థానాల్లో నిలిచే అవకాశం ఉంది.

NLG- WGL-KMM
ఈ సీట్‌కు చాలా ప్రాముఖ్యత ఉన్నా.. చడీచప్పుడు లేకుండా పోల్ పూలింగ్ చేశారు టీయారెస్ వాళ్ళు. రెండు మూడు ట్రాళ్ళని ఎదుర్కున్నా.. ఇవాళ పోలింగ్ కేంద్రాల వద్ద పల్లాకు వ్యతిరేక పవనాలు కనిపించలేదు. అలా అని అధికార పార్టీకి సుసంకేతాలు కూడా లేవు. తక్కువ మార్జిన్ వచ్చినా పర్లేదు అనుకున్నారేమో.. తలపండిన విశ్లేషకులు బరిలో నిలబడ్డా ఎక్కడా బెదరకుండా వెళ్ళిపోయింది అధికార పార్టీ. ఇదే టికెట్ పై ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న, రాణీ రుద్రమదేవిలు పోటీ చేసినా.. వాళ్ళ చరిష్మా కొంతవరకే పనిచేసింది అనుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద కేవలం ఇరు ప్రధాన పార్టీల అనుచరులు, ఫాలోవర్ల హడావిడి ఎక్కువగా కనిపించింది. సో.. ఇక్కడి టికెట్ పై ప్రధానంగా బిజేపి, టీయారెస్‌ల నడుమే పోటీ జరిగింది అనుకోవాలి. తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరాం లకు పడ్డ ఓట్లు ఈ ఇరు పార్టీల్లో దేనికి నష్టమో చెప్పడం కష్టం. అధికార పార్టీ మాత్రం ఓట్స్ పూలింగ్ పైనే ఎక్కువ ఆధార పడ్డది కాబట్టి రవాణా, భోజన సదుపాయాలు ఇతర ఏర్పాట్లన్నీ చాలా ఉత్సాహంగా జరిపించినట్టు సమాచారం. పల్లా, కోదండరాం, మల్లన్న ముగ్గురిలో మొదటి ప్రయారిటీ ఓట్‌కోసం జరిగిన ప్రచారాల వల్ల రెండో ఓట్ బిజేపి మొగ్గినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ.. నల్గొండ జిల్లా తప్పితే వరంగల్, ఖమ్మంలలో బిజేపి పోల్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేయలేకపోయిందని సమాచారం. గుజ్జుల ప్రేమేందర్ మాత్రం రెండో ప్రయారిటీ ఓట్లతోనే ఈ టికెట్‌ని సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల‌ సమాచారం. కానీ ఇక్కడ కూడా గమనించాల్సింది.. నమోదైన పోలింగ్ శాతం. సాధారణంగా జరిగే పోలింగ్ కన్నా 18-20% శాతం అధికంగా ఈసారి పోలింగ్ జరగడంతో.. ఆ ఓట్లన్నీ సమీకరణలవల్ల ఏర్పడ్డవా లేక అధికార పార్టీ పై అసమ్మతిగా నెలకొన్నవా అనేది రిజల్ట్స్ రోజు తేలిపోయే విషయం!
మొదటి స్థానం కోసం పల్లా / ప్రేమేందర్‌లు అనుకున్నా.. ఈ ఇద్దరిలో ఓడినవారు మూడో స్థానానికి చేరుకుంటారని అంచనా. రెండోస్థానంలో ప్రొఫెసర్ కోదండరాం, నాలుగులో మల్లన్నకు నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.