బీజేపీ వైపు చూస్తున్న గులాబీ నేతలు

TRS Candidates trying to move BJP

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇక బీజేపీ దూకుడుకు చెక్ పెట్టటానికి టీఆర్ ఎస్ సైతం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక అందులో భాగంగా తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ బీజేపీకి చెక్ పెట్టె యోచనలో గంగుల కమలాకర్ వంటి కొందరికి మంత్రులుగా పెద్ద పీట వేసింది. తాజాగా కెసిఆర్ తన పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ప్రకటించేసారు. ఈ జాబితాలో కెసిఆర్ నుంచి మాట తీసుకున్న వారు అలాగే ఎప్పటి నుంచో మంత్రి స్థానాన్ని ఆశిస్తున్న వారికి చేదు అనుభవమే మిగిలింది.దీనితో ఆ అసమ్మతి నేతలు అంతా ఇప్పుడు తెరాస పార్టీను వీడే ఆలోచనలో ఉన్నారని వార్తలు ఊపందుకున్నాయి. నాయని నరసింహ రెడ్డి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి నిజామాబాద్ రురల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి సహా మరికొంత మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.వీరిలో చాలా మంది ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని ఈ నెల 17,18 లోపు అమిత్ షా సమక్షంలో బీజేపీ పార్టీలో వీరంతా చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి.మరి వీరిని కెసిఆర్ బీజేపీలో చేరకుండా ఆపుతారా లేదా అన్నది తెలియాల్సి వుంది.

telangana bjp news

శభాష్ విష్ణు.. టైగర్ బిడ్డ అనిపించుకున్నవ్

యూటీగా హైదరాబాద్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *