ఆ మూడు స్థానాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

TRS MLC Candidates

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను టీఆర్ఎస్ ఖరారు చేసింది.
నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేది. నల్గొండ నుండి తేరా చిన్నప్పరెడ్డి, వరంగల్ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి నుండి పట్నం మహేందర్ రెడ్డిలను టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులుగా ఖరారు చేసి ప్రకటించింది .

ఇక వరంగల్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన కొండా మురళీ కాంగ్రెస్ పార్టీలోకి మారిన నేపథ్యంలో తాను రాజీనామ చేయగా ఆ స్థానానికి , అలాగే రంగారెడ్డి నుండి ఎమ్మెల్సిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక రంగారెడ్డి ఎమ్మెల్సి గా ఉన్న పట్నం మహెందర్ రెడ్డి కోడంగల్ శాసన సభ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేఫథ్యంలోనే తెలంగాణలోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సి స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో రంగారెడ్డి , నల్గోండ, వరంగల్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రజత్ కుమార్ తెలిపారు. కాగా మే 31న పోలింగ్ జరుగుతుండగా మే 14న నామినేషన్లు ధాఖలు చేయనున్నారు. కాగా జూన్ 3 న ఒట్ల లెక్కింపు జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *