10 సీట్లకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు

Spread the love

TRS MP CANDIDATES

  • పెండింగ్ లో ఆరు స్థానాలు
  • కాంగ్రెస్ జాబితా వచ్చిన తర్వాతే ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే ప్రకటించిన గులాబీ దళపతి.. లోక్ సభ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ విడుదలైనా, నోటిఫికేషన్ కు ఒక్కరోజే సమయం ఉన్నా.. ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకున్నప్పటికీ, మంగళవారం నిజామాబాద్ లో జరిగే బహిరంగ సభ ముగిసిన తర్వాతే ప్రకటన జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ జాబితా విడుదల చేయగానే.. అందుకు అనుగుణంగా తమ జాబితా ప్రకటించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా.. మిత్రపక్షం ఎంఐఎంకు ఒక స్థానం తీసేసి, మిగిలిన 16 సీట్లనూ గెలవాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకెళుతోంది. ఇందుకు అనుగుణంగానే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతానికి పది స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత వచ్చింది. వారందరికీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని అధిష్టానం నుంచి సమాచారం వచ్చింది. మరో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్‌ ఇప్పటికే 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారంలోగా మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన ముందుగానే జరగొచ్చని తెలుస్తోంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్‌ స్థానాల్లోని అభ్యర్థులపై స్పష్టత రాలేదు.

స్పష్టత వచ్చిన స్థానాలివే…

ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌
కరీంనగర్‌: బోయినపల్లి వినోద్‌ కుమార్‌
నిజామాబాద్‌: కల్వకుంట్ల కవిత
జహీరాబాద్‌: భీంరావు బసంత్‌రావు పాటిల్‌
మెదక్‌: కొత్త ప్రభాకర్‌రెడ్డి
భువనగిరి: బూర నర్సయ్యగౌడ్‌
వరంగల్‌: పసునూరి దయాకర్‌
చేవెళ్ల: జి. రంజిత్‌రెడ్డి
మల్కాజిగిరి: కె. నవీన్‌రావు
నాగర్‌ కర్నూల్‌: పి. రాములు

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *