కాంగ్రెస్ ప్రకటన తర్వాతే గులాబీ జాబితా

Spread the love

Trs Party LOK Saba Candidates Announcement … ఎందుకంటే

కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యుహం మారినట్టు తెలుస్తోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీ క్యాండెట్లను కన్ఫామ్ చేశాక తమ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు రేపు (15వ తేదీ శుక్రవారం) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆ పార్టీ అభ్యర్థులు, బలబలాలు చూసి టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులతో జాబితా సిద్ధం చేశారు .. బుధవారం ప్రకటిస్తామని సంకేతాలు ఇచ్చారు. కానీ తర్వాత మార్చి .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాకే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుంటే … ముందుగా ఖరారుచేసిన ఆరుగురితో తొలిజాబితా విడుదల చేస్తారు. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను వెల్లడించాక .. మిగిలిన 10 మందిని ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.
టికెట్ల కేటాయింపు క్రమంలో శుక్ర, శనివారాల్లో సిట్టింగ్ ఎంపీలకు, ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ విందు ఇవ్వబోతున్నారు. పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులతో .. ఎంపిక కానీ అభ్యర్థులతో విడి విడిగా సమావేశం నిర్వహిస్తారు. కొందరు ఎంపీ అభ్యర్థులను మారుస్తామని ఇప్పటికే గులాబీ దళపతి సంకేతాలు ఇచ్చినందున .. వారితో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులు, సర్వే వివరాలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు వివరిస్తారు. దీంతోపాటు వారికి కల్పించనున్న అవకాశాలను తెలియజేస్తారని సమాచారం.
కొత్తగా పార్టీలో చేరే అభ్యర్థులపై సీఎం కేసీఆర్ బుధవారం సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. చేవెళ్ల నుంచి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డిని బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ టికెట్ ఆశించిన రంజిత్ రెడ్డి మల్కాజిగిరి లేదంటే మరో స్థానానికి మార్చాలని పరిశీలిస్తున్నారు. నల్గొండ, ఖమ్మంలో ఏదో ఒక చోటు నుంచి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి .. మహబూబాబాద్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కవితతోపాటు కొత్తగా రామ్ కిషన్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సీతారాం నాయక్ సీఎం కేసీఆర్ ను కలిసి తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి చేసిన కృషిపై కేసీఆర్ వద్ద ప్రస్తావించారు.
లోక్ సభ సీట్ల కేటాయింపు నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతిభవన్ కు నేతలు పోటెత్తారు. బల్దియా మేయర్ రామ్మోహన్ మహిళా కోటాలో తన భార్య శ్రీదేవి యాదవ్ పేరు పరిశీలించాలని కోరారు. వరంగల్ ఎంపీ దయాకర్, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి రాములు, మల్కాజిగిరి టికెట్ ఆశిస్తోన్న బండి రమేశ్, నల్గొండ నియోజకవర్గ ఆశావహులు కంచర్ల కృష్ణారెడ్డి, తేరా చిన్నపరెడ్డి సీఎంతో సమావేశమై .. టికెట్ పై చర్చించారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం సీఎం ఎర్రవల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు.ఎంపీ టికెట్ కోసం ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు నేతలు క్యూ కట్టారు. తనకు టికెట్ రాకండా కొందరు సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేశారని సీతారామ్ నాయక్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ టికెట్ కోసం కొందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కేటీఆర్ ను కలిసి విన్నవించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *