పార్టీ కార్యాలయ భూమి తనదన్న ఎమ్మెల్యే సోదరుడు

Spread the love

TRS Party Office in Trouble

టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల శంకుస్థాపన నేడు చేయాలని నిర్ణయించారు. ఇక ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సోదరుడు గండ్ర నారాయణ రెడ్డి.

భుపాలపల్లి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిని సేకరించారు. నేడు శంకుస్థాపన కోసం సేకరించిన స్థలంలో భూమి పూజ నిర్వహించాలనుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులను సోదరుడు నారాయణరెడ్డి అడ్డుకున్నారు. సర్వేనెంబర్ 170 లో గల భూమి తమదంటూ వరంగల్ అర్బన్ జిల్లా కు చెందిన మిరియాల పాపిరెడ్డి, అలాగే చెల్పూరు గ్రామానికి చెందిన గండ్ర నారాయణ రెడ్డి అదే స్థలంలో భూమి పూజ నిర్వహించకుండా తమకున్న లారీలను ఆ స్థలంలో పార్క్ చేశారు. అంతేకాదు తమ స్థలంలో పార్టీ కార్యాలయం ఏ విధంగా కడతారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు అది ప్రభుత్వ స్థలం అని చెప్పి లారీలను అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ భూమి పూజకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసుకున్న నేపధ్యంలో సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే ఇటీవల టీఆర్ ఎస్ లో ఫిరాయించిన ఎమ్మెల్యే అయిన గండ్ర వెంకటరమణారెడ్డి సోదరుడే ఆందోళన చేయడం గమనార్హం. ఇక ఈ స్థల వివాదం విషయంలో తాను వెనక్కి వెళ్ళేది లేదంటూ, ఖచ్చితంగా తన స్థలం కోసం పోరాటం చేస్తాం అంటూ గండ్ర సోదరుడు తేల్చి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల భూమి పూజ వేళ భూపాలపల్లిలో టీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీలో ఉన్న నేత సోదరుడే షాక్ ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

warangal trs updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *