వినాయకుని మెడలో టీఆర్ఎస్ కండువా

TRS scarf around Ganesha’s neck

ముషీరాబాద్ లోని గాంధీనగర్ లోని దేవాలయంలో వినాయకుని మెడలో TRS పార్టీ కండువా కప్పిన సంఘటన హిందూ మనోభావాలను తీవ్రంగా గాయపరచిందని వీహెచ్ పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా ఎంఎల్ సీ కల్వకుంట్ల కవిత, స్థానిక ఎమ్మెల్యే  మరియు కార్పోరేటర్ అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై అనర్హత వేటు వేయాల్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. హిందూ వ్యతిరేక ఎజెండాతో పని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ బరితెగించి హిందూ విశ్వాసాలను గాయపరిచిందని, దీనికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *