అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్తానంటున్న తృప్తి దేశాయ్

Trupthi Desai Is Going To Visit Ayyappa

అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి మహిళలకు ప్రవేశం కల్పించాలని గత కొంతకాలంగా కార్యకర్త తృప్తి దేశాయ్ పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే శబరిమలలో మహిళల భక్తులకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక ఆ తీర్పును రివ్యూ చేయాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ఈ వ్యవహారాన్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో మహిళలకు దర్శనానికి అనుమతి లేదని సుప్రీంకోర్టు చెప్పలేదని తృప్తి దేశాయ్ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లబోతున్నానని పేర్కొంది. మరో పక్క కేరళ ప్రభుత్వం మహిళల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చే రక్షణ కల్పించలేమని చేతులెత్తేసింది. అయినప్పటికీ మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ ఈ నెల 20వ తేదీ తర్వాత శబరిమల వెళ్తున్నానని… తనకు రక్షణ కల్పించినా, కల్పించకపోయినా వెళ్లడం ఖాయమని చెప్పారు. ఇంతకు ముందు కూడా అయ్యప్పను దర్శించుకునేందుకు తృప్తి దేశాయ్ యత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. మరోవైపు, కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ మాట్లాడుతూ, ప్రచారం కోసం శబరిమల రావాలనుకునే మహిళలకు రక్షణ కల్పించబోమని స్పష్టం చేశారు. ఈరోజు శబరిమల తలుపులు తెరుచుకోనున్నాయి. రేపటి నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలో ముందు ముందు శబరిమల ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

tags : kerala , shabarimala, women entry, review petitions, supreem court verdict, stay,  larger Bench, trupthi deshai, sabharimala visit

తెలంగాణా ఆర్టీసీ లో వీఆర్ఎస్

67 రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ పై విడుదలైన చింతమనేని ప్రభాకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *