టీటీడీ ఆస్తుల అమ్మకాలు స్టాప్

ttd assets sales stopped

టీీటీడీ బోర్డు అమ్మకాల ప్రక్రియను ఏపి సర్కార్ నిలిపివేసింది.  2016 జనవరి 30 న టీటీడీ బోర్డు తీర్మానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30న చేసిన తీర్మానంలో 50చోట్ల భూములు అమ్మాలని నిర్ణయించిన అప్పటి బోర్డు. భక్తుల మనోభవాలతో వ్యవహరించాలని టీటీడీ బోర్డుకు ప్రభుత్వం సూచించింది. ఆధ్యాత్మికవేత్తలు, ధర్మ ప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయ్యే వరకూ భూముల వేలం ప్రక్రియ నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీటీడీ వివాదంపై  విశాఖ శారదాపీఠం జోక్యం చేసుకున్నది. ఏపీ సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్‌, ఈఓలతో మాట్లాడిన పీఠాధిపతులు స్వరూపానంద స్వామి. భూముల విక్రయంపై వివాదానికి తావులేని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. టీటీడీ నిర్ణయాలు భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటాయన్న స్వరూపానంద. శ్రీవారి ఆలయాన్ని తిరిగి తెరిచే సమయంలో ఈ వివాదానికి తెరదించాలన్నారు. సోషల్ మీడియా వేదికగా విశాఖ శారదాపీఠంపై అనవసరంగా దాడి చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. రాజకీయ పార్టీల ముసుగులో కొందరు హిందూ వ్యతిరేకులు పీఠంపై కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

ttd assests case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *