టీటీడీ క్యాలెండర్‌ను విడుదల

TTD Calender Released

ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించే క్యాలెండర్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి హైదరాబాద్ లో విడుదల చేసినట్లు లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గోవిందహరి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 12 షీట్లతో రూపొందించిన ఈ క్యాలెండర్ లో వెంకన్న స్వామి అన్ని రూపాలు ఉంటాయని తెలిపారు. ఈ క్యాలెండర్ నేటి నుంచి హిమాయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం(బాలజీ భవన్)లో అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ఈ క్యాలెండర్ ధర రూ. 100 గా నిర్ణయించామని, కొనుగోలుదారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యాలెండర్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని రకాల క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమేష్, కృష్ణయ్య, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *