టీటీడీ పేద పిల్లల ఆస్పత్రి

8
ttd poor children hospital
ttd poor children hospital

ttd poor children hospital

చిన్న పిల్లల ( పీడియాట్రిక్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని టీటీడీ యాజమాన్యం ఆలోచన చేేసింది. బర్డ్ ఆసుపత్రి పాత భవనంలో పీడియాట్రిక్ కార్డియాక్ యూనిట్ ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు చేపట్టింది. 300 పడకలతో సూపర్ స్పెషాలిటీ శాశ్వత భవనం నిర్మించడానికి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ లతో సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ క్రింది విభాగాలు ఉంటాయి:

1. కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ
2. న్యూరాలజీ మరియు సర్జరీ
3. నెఫ్రాలజీ మరియు యూరాలజీ
4. గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు శస్త్రచికిత్స
5. హేమాటో ఆంకాలజీ మరియు ఎముక మజ్జ మార్పిడి యూనిట్
6. ఆర్థోపెడిక్స్ మరియు పునరావాసం
7. వృద్ధి మరియు అభివృద్ధి లోపాలు మరియు ఎండోక్రినాలజీ
8. మార్పిడి మరియు శస్త్రచికిత్స విభాగం
9. జన్యుశాస్త్ర విభాగం

ఈ నేపథ్యంలో యు ఐ సి కి చెందిన సంజయ్ కె సింగ్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి విరాళం ఇస్తానని ముందుకు వచ్చారు. అందుకు తగ్గట్టు ఈ నెల 12వ తేదీ ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. ఇందులోని ప్రధానాంశాలు ఇవీ..

– 5 ఎకరాల స్థలంలో యుఐసి సంస్థ ఆసుపత్రి భవనం నిర్మిస్తుంది. ఈ భూమి టీటీడీ యాజమాన్యం కిందే ఉంటుంది. నిపుణుల సలహా మేరకు తొలుత 150 పడకలతో ఆసుపత్రి ప్రారంభించి తరువాతి దశలో దీన్ని 300 పడకల స్థాయికి తీసుకుని వెళ్లడానికి నిబంధన పొందుపరచడం జరిగింది. ఆసుపత్రి భవనాల నిర్మాణం, మందులు, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, సిబ్బంది వంటివి టీటీడీనే నిర్వహిస్తుంది. నిపుణుల సలహా మేరకు దాతల నుంచి తొలి సంవత్సరాలలో ఆసుపత్రి నిర్వహణ ఖర్చు కూడా విరాళాల రూపంలో స్వీకరించుటకు నిర్ణయించడమైనది. తదనుగుణంగా ఈ ఖర్చులు యుసిఐ భరించేలా నిర్ణయించడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో పేద పిల్లలకు ఉచిత వైద్యం అందించే ఆసుపత్రి. ఇందులో ఎలాంటి యూజర్ చార్జీలు, ఫీజులు ఉండవు

– టీటీడీ భూమిని ఏ కంపెనీ పేరు మీద లీజుకు ఇవ్వడం కానీ, బదలాయించడం కానీ జరగదు. భూమి హక్కులు, స్వాధీనం టీటీడీ ఆధ్వర్యంలో ఉండును. యు ఐ సి కేవలం ఆసుపత్రి భవనాన్ని నిర్మించి టిటిడికి అప్పగించడం జరుగుతుంది. ఆసుపత్రి టీటీడీ అజమాయిషీ లోనే ఉంటుంది. ప్రారంభ సంవత్సరములలో నిర్వహణ ఖర్చులు యు ఐ సి సంస్థనే ఇవ్వడం జరుగుతుంది. టీటీడీ భక్తుల నుంచి నమ్మకం మీదే విరాళాలు స్వీకరిస్తుంది. ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి వారిని లోతుగా ప్రశ్నించదు. అవసరమైన సందర్భాలలో దాతల యొక్క ఆర్థిక మరియు ఇతర వివరాలను స్వీకరిస్తుంది. యు సి ఐ ఏ కారణం చేతనైనా వెనకడుగు వేస్తే ఆసుపత్రి టీటీడీ నే నిర్మిస్తుంది. ఈ విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

TTD Latest News