తిరుమల శ్రీవారి సేవా టికెట్లు విడుదల

Spread the love

TTD SEVA TICKETS RELEASED

  • జూన్ మాసానికి సంబంధించి అందుబాటులో 63,804 టికెట్లు
  • ఎలక్ట్రానిక్ డిప్ కోసం 10,129 టికెట్లు

కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్తానం(టీటీడీ) శుక్రవారం ఉదయం విడుదల చేసింది. జూన్ నెలకు సంబంధించి మొత్తం 63,804 టికెట్లను టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో పెట్టింది. వీటిలో 10,129 సేవా టికెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానానికి కేటాయించారు. డిప్‌ పద్ధతిలో సుప్రభాత సేవకు 7,924, తోమాల సేవ 120, అర్చన 120, అష్టదళ పద్మారాధన సేవ 240, నిజ పాదదర్శనానికి 1,725 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ లో లాగిన్ అయి, సంబంధిత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈనెల 1వ తేదీ శుక్రవారం నుంచి ఈనెల 5వ తేదీ గురువారం ఉదయం 10 గంటల వరకు డిప్ లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతం అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు కంప్యూటర్ లాటరీ తీసి, టికెట్లు కేటాయిస్తుంది. లాటరీలో పేరు వచ్చినవారికి ఎస్సెమ్మెస్ వస్తుంది. ఇక జూన్ మాసానికి సంబంధించి సాధారణ పద్ధతిలో 53,675 టికెట్లను కేటాయించారు. అందులో విశేష పూజకు వెయ్యి, కల్యాణోత్సవం 13,775, ఊంజల్‌ సేవ 4,350, వసంతోత్సవం 7,700, సహస్ర దీపాలంకరణ 18,600, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 8,250 టికెట్లు ఉన్నాయి. కాగా, శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి ఉండే భక్తులకు మరింత సౌకర్యవంతంగా వసతులు కల్పించేందుకు తితిదే చర్యలు తీసుకుంటోందని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వివరించారు. ఇక్కడి అన్నమయ్య భవన్‌లో శుక్రవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో పలు కార్యక్రమాలను ఆయన వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి పట్టే సమయం, కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులకు అందుతున్న వసతుల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో నిర్మించిన శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 13న విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలిపారు.

DEVOTIONAL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *