29 మందితో టీటీడీ పాలకమండలి

TTD TRUST BOARD

ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డు సభ్యుల నియామకం పూర్తయింది. గత కొన్ని రోజులుగా పలు ఊహాగానాలు సాగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం బుధవారం 29 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది. చైర్మన్, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, 24 మంది సభ్యులతో ఈ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అందరూ ఊహించినట్టే మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావుకు టీటీడీలో చోటు దక్కింది. అలాగే నమస్తే తెలంగాణకు చెందిన దామోదరరావు సైతం టీటీడీ సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి ఏడుగురు చొప్పున, తమిళనాడు, కర్ణాటక నుంచి నలుగురు చొప్పున, మహారాష్ట్ర నుంచి ఒకరు ఎంపిక కాగా, తొలిసారిగా ఢిల్లీ నుంచి కూడా ఓ సభ్యుడిని నియమించారు.

టీటీడీ కొత్త సభ్యులు వీరే..

యూవీ రమణ మూర్తి రాజు (ఎమ్మెల్యే),  మేడా మల్లికార్జున రెడ్డి (ఎమ్మెల్యే), కె.పార్థసారథి (ఎమ్మెల్యే), పరిగెల మురళీ కృష్ణ, కృష్ణమూర్తి వైధ్యనాథన్, నారాయణ స్వామి శ్రీనివాసన్, జే. రామేశ్వరరావు (మైహోం), వి.ప్రశాంతి, బి.పార్థసారథి రెడ్డి, డాక్టర్ నిచ్చిత ముప్పవరపు, నాదెండ్ల సుబ్బారావు, డీపీ అనిత, రాజేష్ శర్మ, రమేశ్ శెట్టి, గుండవరం వెంకట భాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, చిప్పగిరి ప్రసాద్ కుమార్, ఎంఎస్ శివ శంకరన్, సంపత్ రవి నారాయణ, సుధా నారాయణ మూర్తి, కుమారగురు (ఎమ్మెల్యే), పుత్తా ప్రతాపరెడ్డి, కె.శివకుమార్. వీరితోపాటు దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్, కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవో ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు.

AP NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *