కీర్తి కేసులో ట్విస్ట్ లు ఎన్నో…

TWISTS IN KEERTHI CASE

హయత్ నగర్ లో  కన్న కూతురు తల్లిని అత్యంత పాశవికంగా హతమార్చడం హాట్ టాపికైంది. మైనర్ వయసులో కీర్తి రెడ్డి తెలిసి తెలియక చేసిన తప్పు ఇప్పుడు మూడు కుటుంబాల పరువు రోడ్డెక్కించింది. 17 ఏళ్ల వయసులో ప్రేమ అంటూ ఆకర్షణకు లోనై ఓ యువకుడి వలలో చిక్కుకున్న కీర్తి రెడ్డి తన జీవితం అంధకారం చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపికైంది. లవ్ పేరుతో ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి హద్దులు దాటించిన ప్రియుడు గర్భవతిని చేశాడు.అబార్షన్ చేసుకునే క్రమంలో పక్కింటి కుర్రాడి సాయం తీసుకుని కీర్తి రెడ్డి మరో తప్పు చేసింది. అదే అతడికి అస్త్రంగా మారి చివరకు కీర్తి రెడ్డిని ఉసిగొల్పి తల్లి హత్యకు ప్రేరేపించినట్లైంది. అయితే ఇప్పుడు కీర్తి  కేసు ఇప్పుడు ఆమంగల్ చుట్టూ తిరుగుతోంది. కీర్తి రెడ్డికి అక్కడ గర్భస్రావం ఎందుకు చేయించాల్సి వచ్చిందనే కోణంలో తీగ లాగుతున్నారు పోలీసులు.

నల్గొండ టు ఆమంగల్ వయా హయత్‌నగర్ తీరుగా సాగిన కీర్తి రెడ్డి తల్లి హత్య కేసులో రోజుకో నిజం వెలుగుచూస్తోంది. హయత్‌నగర్‌లో ఈ నెల 19వ తేదీన పక్కింటి కుర్రాడు శశి కుమార్‌తో కలిసి తల్లిని సొంత కూతురే అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హాట్ టాపికైంది. తొలుత కేసును పక్కదారి పట్టించాలని చూసిన కీర్తి రెడ్డి, శశి కుమార్ ఆటలు సాగలేదు. చివరకు వారిద్దరే ముద్దాయిలుగా తేలారు. వీరితో పాటు కీర్తి రెడ్డి మొదటి ప్రియుడు బాల్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా వేర్వేరుగా ముగ్గురిని ప్రశ్నించడంతో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడ్డాయి. చివరకు ఈ కేసు 10 లక్షల రూపాయల చుట్టూ తిరగడం కొసమెరుపు. అదలావుంటే ప్రస్తుతం పోలీసుల దృష్టి కీర్తి రెడ్డికి అబార్షన్ చేయించిన ఆమంగల్ వైపు మళ్లింది.హైదరాబాద్‌లో గర్భస్రావం చేయించుకోవడం కుదరదని భావించడం ఒక కారణమైతే.. ఎల్‌బీ నగర్‌లోని ఓ వైద్యుడి సూచనతోనే వీరు ఆమంగల్ వెళ్లినట్లు తెలుస్తోంది. అతడి సలహా మేరకు ఈ ఏడాది జనవరిలో అక్కడకు వెళ్లి అబార్షన్ చేయించుకుంది కీర్తి రెడ్డి. ఆ సమయంలో బాల్‌‌రెడ్డి, శశి కుమార్ ఇద్దరు కూడా తోడుగా ఉన్నారు. అక్కడే రెండు రోజులు రెస్ట్ తీసుకుని ఏమీ తెలియనట్లు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే ఈ కేసులో ఆమంగల్‌ పేరు మార్మోగింది. అక్కడ జోరుగా అబార్షన్లు జరుగుతున్నాయనే టాపిక్ చర్చానీయాంశంగా మారింది.

CRIME NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *