ఒప్పో రియల్ మి నుంచి రెండు కొత్త ఫోన్లు

TWO PHONES FROM REAL ME

  • రియల్ మి ఎక్స్, రియల్ మి ఎక్స్ లైట్ ఆవిష్కరణ
  • త్వరలో ఇండియాలో లాంచ్ చేయనున్న కంపెనీ

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పోకి చెందిన రియల్ మి నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదలయ్యాయి. రియల్ మి ఎక్స్, రియల్ మి ఎక్స్ లైట్  స్మార్ట్ ఫోన్లను కంపెనీ చైనాలో ఆవిష్కరించింది. వీటిని త్వరలోనే భారత్ లో కూడా లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు భారీ డిస్ ప్లే, భారీ బ్యాటరీ కలిగి ఉండటం విశేషం. ధర కూడా రూ.15వేల రేంజ్ లోనే నిర్ధారించింది. రియల్ మి ఎక్స్ 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.13,300 కాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధరను రూ.15,400గా నిర్ధారించింది. ఇక రియల్ మి ఎక్స్ లైట్ 4 జీబీ 64 జీబీ వెర్షన్ ధర రూ.13,999.

రియల్ మి  ఎక్స్‌ ఫీచర్లు ఇవే…
6.5 అంగుళాల డిస్‌ప్లే
స్నాప్ డ్రాగన్ 710 చిప్ సెట్
1080 x 2340 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్‌ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్
4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌
48 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్‌ + 5 ఎంపీ రియర్ కెమెరా
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3765 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ

రియల్‌మి ఎక్స్‌ లైట్‌ ఫీచర్లు ఇవే…
6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1080 x 2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
16+5 మెగాపిక్సెల్ డబుల్‌ రియర్‌ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
4045 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ

Latest offers of realMe Mobiles in Flipkart Click Here

Discount offers and Latest Mobile of REALME U1 25 mp ON AMAZON

MOBILE Discounts and Offers Click 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *