రెండు వారాలు కీలకమన్న ట్రంప్

TWO WEEKS CRUCIAL SAYS TRUMP

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా రక్కసి అమెరికాలో తన ప్రతాపం చూపిస్తున్న వేళ చాలా బాధతో దేశ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రతి అమెరికన్ కూడా కఠినమైన రోజులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని, మన దేశంలో రెండు లేదా మూడు వారాల్లో అతి దారుణ చరిత్ర ఇదే మొదటిది కావచ్ఛునని  ఆయన చెప్పారు. ‘వుయ్ ఆర్ గోయింగ్ టు లూజ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్’ (మనం వేలాది ప్రజలను కోల్పోనున్నాం)  అని వ్యాఖ్యానించారు. అమెరికాలో రానున్న రెండు వారాలు మనకు జీవన్మరణ సమస్యే అన్నారు అధ్యక్ధుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ రెండు వారాలూ కీలకమైనవని. మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఈ కాలంలో దేశంలో లక్ష మంది నుంచి  2 లక్షల 40 వేల మంది వరకు ప్రజలు కరోనా రాకాసికి బలి కావచ్ఛునన్న వైట్ హౌస్ అంచనాను అయన పరోక్షంగా ప్రస్తావించారు.

నిన్న మొన్నటివరకు కరోనా వల్ల భయం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని చెప్పిన ఆయన.. ఇప్పుడిలా మాట మార్చి బేర్ మన్నారు.’ నేనేమీ బ్యాడ్ న్యూస్ చెప్పడం లేదు.. ప్రజలకు ఆశ అన్నది కల్పించాలన్నదే నా ఉద్దేశం ‘ అని కూడా అన్నారు. అమెరికన్లు ఇళ్లలోనే ఉండిపోయి.. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించినప్పటికీ జన నష్టం తప్పదన్న ధోరణి ఆయన మాటల్లో కనిపించింది. తాను ఈ దేశానికి ‘ఛీర్ లీడర్’ నని అంటూనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కరోనా నివారణకు  వైట్ హౌస్ లో ఆయన ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ కేవలం మీడియా సమావేశాలకే పరిమితమై ఉన్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ ఏది మాట్లాడితే అదే వేదమన్నట్టు వ్యవహరిస్తోంది.

tags: corona virus, corona pandemic, corona effect, USA, america, Donald trump, white house,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *