‘ఉద్గర్ష ‘ చిత్ర ట్రైలర్ విడుదల

Spread the love
Udgarsha Movie trailer LAUNCH
కన్నడ సినీ పరిశ్రమ లో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఆద్యుడు డైరెక్టర్ సునీల్‌కుమార్‌ దేశాయ్‌.. అయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ ఉద్గర్ష ‘.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్  ఇటీవలే పూర్తి చేసుకోగా, కన్నడ,తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా  విడుదల అవుతుండడం విశేషం.. ఈ సినిమా లోని అధికభాగం చిత్రీకరణ మడికెరిలో లో జరగగా కేరళ, బెంగళూరు, హైదరాబాదు నగరాల్లో ప్రధాన సన్నివేశాల్ని చిత్రీకరించారు.. కిషోర్, సాయి ధన్సిక, తాన్య హోప్, కబీర్ దుహాన్ సింగ్, బాహుబలి ఫేమ్ ప్రభాకర్ ,హర్షికా , అనూప్‌సింగ్‌ ఠాకూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..డి క్రియేషన్స్‌ పతాకంపై దేవ్ రాజ్ ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా  ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ సంగీత దర్శకుడు సంజయ్ చౌదరి సంగీతం సమకూరుస్తుండగా పి.రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.. కాగా ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుక బెంగుళూరు లో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ హీరో దర్శన్  ఈ చిత్ర  ట్రైలర్ ని విడుదల చేశారు.. ప్రముఖ హీరో కిచ్చ సుదీప్ ఈ ట్రైలర్ కి వాయిస్ అందించగా ,  ప్రేక్షకులను విశేషంగా అక్కట్టుకుంటుంది..
తారాగణం : అనూప్‌సింగ్‌ ఠాకూర్‌, కిషోర్, సాయి ధన్సిక, తాన్య హోప్, కబీర్ దుహాన్ సింగ్, బాహుబలి ఫేమ్ ప్రభాకర్ ,హర్షికా
సాంకేతిక విభాగం :
బ్యానర్ : డి క్రియేషన్స్‌
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : సునీల్‌కుమార్‌ దేశాయ్‌
నిర్మాత :  దేవ్ రాజ్ ఆర్
మ్యూజిక్ డైరెక్టర్ : సంజయ్ చౌదరి
సినిమాటోగ్రఫీ :  పి.రాజన్ , K.M. విష్ణువర్ధన్
ఆర్ట్ డైరెక్టర్: మోహన్ B కేర్
ఎడిటింగ్: బి.ఎస్.కెంపరాజు
స్టంట్స్: వెంకట్ మరియు నబా-సుబ్బు
సౌండ్ ఎఫెక్ట్స్: శంకర్
మాటలు: హనుమాన్ చౌదరి, కే.ప్రతాప్ రెడ్డి
ప్రచార డిజైనర్: భూషణ్
కాస్ట్యూమ్ డిజైనర్: గందసి నాగరాజ్

Latest Interesting Telugu News Tsnews

For More New 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *