శ్రీ శార్వరినామ సంవత్సర ఫలితాలు

28
UGADI PANCHANGAM 2020
UGADI PANCHANGAM 2020

UGADI PANCHANGAM 2020

ఉగాది 25-03-2020 న

నవనాయకులు:-

రాజు — మంత్రి

మంత్రి,సేనాధిపతి,మేఘాధిపతి — చంద్రుడు

రసాధిపతి — శని

నీరసాధిపతి — గురుడు

 

కందాయఫలాలు :-

అశ్విని — 05 – 0 – 0 , భరణి —  01 – 01 – 03, కృత్తిక  —  04 – 02 – 01,రోహిణి  —  0 – 0 – 04,మృగశిర  —  03 – 01 – 02,ఆరుద్ర  —  06 – 02 – 0,పునర్వసు  —  02 – 0 – 03, పుష్యమి —  05 – 01 – 01,

ఆశ్లేష —  01 – 02 – 04, మఘ —  04 – 0 – 02, పుబ్బ —  0 – 01 – 03, ఉత్తర —  03 – 02 – 03, హస్త —  06 – 0 – 01, చిత్త —  02 – 01 – 04, స్వాతి —  05 – 02 – 02, విశాఖ —  01 – 0 – 0, అనురాధ —  04 – 01 – 03,

జ్యేష్ఠ —  0 – 02 – 01, మూల  —  03 – 0 – 04, పూర్వాషాఢ  —  06 – 01 – 02, ఉత్తరాషాడ  —  02 – 02 – 0, శ్రవణం  —  05 – 0 – 03, ధనిష్ఠ  —  01 – 01 – 01, శతభిషం  —  04 – 02 – 04,పూర్వభాద్రపద  —  0 – 0 – 02,

ఉత్తరాభాద్రపద —  03 – 01 – 0,రేవతి  —  06 – 02 – 03,

 

సూర్యగ్రహణం :-

21-06-2020 న పాక్షిక సూర్యగ్రహణం

ఉదయం 10-25 నిముషాల నుండి మధ్యాహన్నం 15-29 ని. వరకు

మేషరాశి వారికి :-

గురుడు మార్చి 29వ తేదీ నుండి 10లో జూన్‌ 29వతేదీ నుండి 9లో మరియూ నవంబర్‌ 20 నుండి 10లో తదుపరి ఏఫ్రిల్‌ 5వ తేదీ నుండి 11లోసంచరించును. శని సంవత్సరమంతా 10లోసంచరించును. రాహుకేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు తృతీయ భాగ్యస్థానము నందు తదుపరి ద్వితీయ అష్టమ స్థానములందు సంచరించును.సంచార కాలములో అనారోగ్యము, స్థలమార్పిడికి అవకాశం వుంది. గురు బలముచే ఈ రాశి స్త్రీ పురుషులకు వివాహము జరుగవలసిన వారికి వివాహ సిద్ధి, విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యాపారస్తులకు ఆశించిన ధనలాభము కలుగును. ఉపాధ్యాయులు పై అధికారుల మన్ననలను పొందుతారు. రైతులకు మంచికాలము. గతంలో పడ్డ శ్రమకు గుర్తింపును పొందుతారు, రెండు పంటలూ అనుకూలించును. పాడి, పౌల్ట్రి పరిశ్రమల యజమానుదార్లు లాభములను పొందుతారు. రాజకీయ నాయకులకు ఆశించిన పదవులు, స్థాయి లభించే అవకాశం వుంది. వైద్య, న్యాయవాదులు లాభములను పొందుతారు. నటకులు, గాయకులు, క్రీడాకారులకు కాలము అనుకూలంగా ఉండును. శివాలయంలో అభిషేకం శనగలు దానం ఇవ్వడం మంచిది. ప్రతిరోజూ శివాష్టోత్తరం చదవండి.

 

వృషభరాశి :-

ఆదాయం : 14 వ్యయం : 11, రాజపూజ్యం : 6, అవమానం : 1

వృషభరాశివారికి గురుడు మార్చి 29వ తేదీ నుండి 9లో జూన్‌ 29వ తేదీ నుండి 8లో మరియూ నవంబర్‌ 20 నుండి 9లో తదుపరి ఏఫ్రిల్‌ 5వతేదీ నుండి 10లో సంచరించును. శని సంవత్సరమంతా 9లో సంచరించును. రాహేకేతువులు సంవత్సరాది నుండి నుండి సెప్టెంబర్‌ 23 వరకు ద్వితీయ, అష్టమ స్థానములందు తదుపరి జన్మ, సప్తమస్థానములందు సంచరించును.ఈ సంవత్సరము మిశ్రమముగా ఉండును. గురుని భాగ్యరాశి సంచారకాలము సర్వశుభములను కలుగుజేయును. అష్టమరాశి సంచార కాలమందు ఆపదలు, అనారోగ్యము, స్థలమార్పిడి అవకాశం ఉంది. శనైశ్చర్యుని భాగ్యరాశి సంచారకాలము కొంత అసౌఖ్యమును కలిగించును. రాహువు ధనస్థాన సంచారకాలము. కుటుంబంలో కొంతమేర కొట్లాటలకు, ధననష్టమునకు, వాగ్వివాదములకు అవకాశాలు ఉన్నాయి. జన్మరాశి సంచారకాలములో అనారోగ్యములు, స్థలమార్పిడి, మానసిక ఆందోళనలను కలిగించును. కేతువు అష్టమరాశి సంచార కాలములో దేహపీడలు, స్థలమార్పిడికి అవకాశం ఉంది. సప్తమరాశి సంచార కాలములో భార్యభర్తల మధ్య సమస్యలకు ఆస్కారం వుంది కాస్త జాగ్రత్తలు పాటించండి. పరిశీలించగా వృషభరాశి వారికి ఈ సంవత్సరము పరీక్షాకాలము. గురుబలము పూర్తిగా లేదు. రాహుకేతువులు, శనైశ్చరుడు అనుకూలురు కాదు. ఏ రంగంలోని వారైన జాగ్రత్తగా ఉండవలెను. విద్యార్థులు సామాన్య ఫలితములతో ఉత్తీర్ణులవుతారు. ఉపాధ్యాయులకు స్థలమార్పిడికి అవకాశం, వ్యాపారస్తులకు ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థములో సామాన్య ఉండను. రైతులకు రెండవ పంట కష్టపడ్డం వల్ల మంచి ఫలితాలు కలుగును. కళాకారులకు సామాన్యము. వైద్యులు న్యాయవాదులు తమ వృత్తియందు తగిన నైపుణ్యము ప్రదర్శించలేరు. ఆరోగ్య విషయములో తగిన శ్రద్ధ తీసుకోవాలి. రాజకీయ నాయకులు మౌనముగా యుండుట మంచిది. హనుమాన్ దేవాలయం , శివాలయం దర్శనం మంచిది. నల్లనువ్వులు అలాగే శనగలు దానం ఇవ్వాలి.

మిథునరాశి : –

ఆదాయం : 2, వ్యయం : 11, రాజపూజ్యం : 2, అవమానం : 4

మిథునరాశి వారికి గురుడు మార్చి 29వ తేదీ నుండి 8లో జూన్‌ 29వతేదీ నుండి 7లోమరియూ నవంబర్‌ 20 నుండి 8లో తదుపరి ఏఫ్రిల్‌ 5వ తేదీ నుండి 9లోసంచరించును. శని సంవత్సరమంతా 8లోసంచరించును . రాహు, కేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు జన్మ, సప్తమ స్థానములందు తదుపరి వ్యయ, షష్ఠ స్థానములందు సంచరించును. ఈ రాశి వారికి గురుని సప్తమ రాశి సంచారకాలములో భార్యభర్తల మధ్య సానుకూల వాతావరణం. గురుని అష్టమరాశి సంచారకాలములో ధననష్టము, అనారోగ్యము. స్థలమార్పిడికి అవకాశం వుంది. శని అష్టమరాశి సంచారకాలములో అపమృత్యు భయము, స్థలమార్పిడి, ధననష్టములు కలుగును. రాహువు జన్మరాశి యందు సంచారకాలములో మానసిక ఆందోళనలు, అనారోగ్యము, వ్యయరాశి సంచార కాలములో ఆపదలు స్థలమార్పిడి, ధననష్టములు కలుగును. సెప్టెంబరు 23వ తేదీ నుండి కేతువు షష్ఠరాశి సంచారకాలము సంతోషమును కలుగజేయును. ఈరాశివారికి గురుబలము సామాన్యము. శని రాహుకేతు బలము సాధారణంగా ఉండును. విద్యార్థులు సామాన్య విజయములు. ఆరోగ్య విషయములో శ్రద్ధగా ఉండాలి. ఉపాధ్యాయులకు స్థలమార్పిడికి అవకాశం ఉంది. పై అధికారుల ఒత్తిడి వలన వ్యాపారస్థులకు నష్టము లేకపోయిన సామాన్యంగా ఉంటుంది. రైతులకు పంటలు కలసి వచ్చును. డాక్టర్లు, న్యాయవాదులు వృత్తిపనివారలు, పాడిపరిశ్రమ, పౌల్ట్రి యజమానులు అనుకూలమైన కాలం కాదు రాజకీయ నాయకులకు సామాన్యము. గణపతి దేవాలయం దర్శనమ్ మంచిది, ప్రతిరోజు గణపతి అష్టకం చదవండి. నల్లనువ్వులు దానం ఇవ్వడం మంచిది.

కర్కాటకరాశి : 

ఆదాయం : 11, వ్యయం : 8, రాజపూజ్యం : 5, అవమానం : 4

కర్కాటకరాశి వారికి గురుడు మార్చి 29వ తేదీ నుండి జూన్‌ 29వ తేదీ నుండి 6లో మరియూ నవంబర్‌ 20 నుండి 7లో తదుపరి ఏఫ్రిల్‌ 5వ తేదీ నుండి 8లోచరించును. సంవత్సరారంభంలో మంచి ఆరోగ్యము, హుషారు, తదుపరి క్లేశముల వలన ధనహాని మరియు ధన వ్యయమునూ కలుగజేయును. శని సంవత్సరమంతా 7లో సంచరించును. రాహుకేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు వ్యయ, షష్ఠస్థానములందు తదుపరి లాభ, పంచమ స్థానములందు సంచరించును.ఆరోగ్య విషయములపై శ్రద్ద వహించకపోవుట, వేళ దాటి నిద్రించుట, ఇతర విషయములలో అనవసర జోక్యము, అధిక ప్రసంగములు, సమయమునకు తగిన ఆలోచన లోపించుట, దురాలోచన లేకపోవుట, కృషికి తగిన ప్రతిఫలము పొందలేకపోవుట జరుగును. అధిక ధనవ్యయములు తగ్గించుట మంచిది. ఈ రాశిలోని వివాహము కావలసిన స్త్రీ పురుషులకు సంవత్సర ద్వితీయార్థములో వివాహం జరుగును. విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ, కష్టపడడ్డం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఉపాధ్యాయులకు ద్వితీయార్థములో అధికారుల మన్ననలు, గౌరవ మర్యాదలు పొందుతారు. పూర్వార్థములో స్థలమార్పిడి కలుగును. వ్యాపారస్తులకు ద్వితీయార్థములో లాభములు, రైతులకు మొదటిపంట కన్నా రెండవపంట బాగుంటుంది. మొత్తం మీద వ్యవసాయదారులకు బాగుంటుంది. వృత్తి పనివారలకు సంవత్సర ద్వితీయర్థములో సుఖసంతోషములు, కళాకారులకు, గాయకులకు అఖండ గౌరవ సన్మానములు, క్రీడాకారులకు గౌరవము, గుర్తింపు లభించును. వైద్యులు, న్యాయవాదులు, పౌల్ట్రి యాజమాన్యము, పాడి పరిశ్రమల వారికి సంవత్సర ద్వితీయార్థములో మిక్కిలి లాభదాయకముగా నుండును. మత్స్య పరిశ్రమల వారికి సంవత్సర ద్వితీయార్థములో అధిక లాభములను పొందుతారు. ఈ రాశిలో సం.. పూర్వార్థములో ఏరంగములోని వారికైననూ గురు, రాహు స్థల దోషములు, తగినంత బలము లేకపోవుటచే ధనలాభములు సాధారణంగా ఉంటాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మంచిది. పెసలు దానం ఇవ్వడం మంచిది. గణపతి అభిషేకం మంచిది.

సింహరాశి :-

ఆదాయం : 14, వ్యయం : 2, రాజపూజ్యం : 1, అవమానం : 7

ఈ రాశి వారికి గురుడు మార్చి 29వ తేదీ నుండి 6లో జూన్‌ 29వ తేదీ నుండి 5లో మరియూ నవంబర్‌ 20 నుండి 6లో తదుపరి ఏఫ్రిల్‌ 5వతేదీ నుండి 7లోసంచరించును. శని సంవత్సరమంతా 6లో సంచరించును. రాహూకేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు లాభ, పంచమ స్థానము లందు తదుపరి దశమ, చతుర్థ స్థానములందు సంచరించును. సింహరాశి వారికి 5లో గురుడు సంపద, 6లో శని లక్ష్మీ ప్రవర్ధనం, 11లో రాహువు సర్వశుభములు, ఆకస్మిక ధనలాభములు 5లో కేతువు వ్యయము. ఈ రాశి వారికి ఈ సం.. శనైశ్చరుని బలము తగినంతగా ఉండుటవలన సర్వ కార్యసిద్ధి, ధనధాన్యాభివృద్ధి మీ ఇంట శుభకార్యములు జరిగే అవకాశం, ఉద్యోగస్తులకు అధికారుల అండ, పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు, వ్యాపారులకు వరుసగా ఆశించిన పదవులు, ధనలాభము కలసి వస్తాయి. శుభవార్తలు వింటారు, కుటుంబ వృద్ధి, శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . ఈ రాశి వారికి గురుని పంచమ రాశి సంచార కాలములో ఋణ బాధలు, అనారోగ్యములు, శతృ బాధలు కలుగును. శని షష్ఠ స్థాన ధైర్యము, సంచారకాలము ధన ధాన్య లాభములు,  భూవృద్ధి, బంధుమిత్రులతో సంతోష సౌఖ్యములు. సంఘములో గుర్తింపు. రాహువు లాభస్థానమున సంచరించుట వలన ఆకస్మిక ధన లాభములు,  ధైర్యము.  కార్యజయము కలుగును. కేతువు యొక్క పంచమ స్థాన సంచారము మాత్రము దుర్వ్యయమున్నూ,  వాగ్వివాదములను కలుగజేయును చతుర్థస్థాన సంచారము తల్లి తరపు వారితో విరోధములు కలుగుటకు అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి గురుబలము సామాన్యము. శనిబలము పరిపూర్ణముగా కలదు. రాహు బలము కొంతవరకు కలదు. కావున రాజకీయముగా పలుకుబడి కలిగి వుంటారు. ఈ రాశి స్త్రీ పురుషులకు వివాహము సంవత్పర పూర్వార్థములో జరగును. విద్యార్థులకు కష్టపడ్డం వల్ల మంచి ఫలితములు వస్తాయి ఏ మాత్రం అశ్రద్ధ వద్దు.  ఉపాధ్యాయులకు సం.. ద్వితీయార్థములో స్థలమార్పిడికి అవకాశం, అధికారుల ఆగ్రహమునకు గురికాగలరు. రైతులకు పంటలు అనుకూలించును. వృత్తి వ్యాపారములకు అనుకూలము, ధన లాభములు. పాడి, పౌల్ట్రీలు, మత్స్య పరిశ్రమ వారికి సం.. పూర్వార్థములో అధిక లాభములు, తదుపరి ద్వితీయార్థములో సాధారణ  లాభములు.  నటులు,  గాయకులు,  కళాకారులకు సంపూర్వార్థమే అనుకూలం, సమాజములో గుర్తింపు, క్రీడాకారులకు సన్మానములు, వృత్తి పనివారలకు సం.. మంతా లాభదాయకంగా వుండును. దుర్గాఆలయం దర్శనం చేయుట మంచిది. ప్రతిరోజు దుర్గాస్తోత్రం చదవండి. మినుములు దానం ఇవ్వడం మంచిది.

కన్యారాశి : –

ఆదాయం : 2, వ్యయం : 11, రాజపూజ్యం : 4, అవమానం : 7

ఈ రాశివారికి గురుడు మార్చి 29వతేదీ నుండి జూన్‌ 29వతేదీ నుండి 4లో మరియు నవంబర్‌ 20 నుండి 5లో తదుపరి ఏఫ్రిల్‌ 5వ తేదీ నుండి 6లో సంచరించును. శని సంవత్సరమంతా 5లోసంచరించును. రాహుకేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు దశమ, చుతర్థ స్తనాములందు తదుపరి భాగ్య, తృతీయ స్థానములందు సంచరించును. ఈ రాశివారికి గురుని చతుర్థ స్థాన సంచారమున ధనవ్యయము, బంధువుల వలన ధననష్టము కలుగును. అర్ధాష్టమ సంచార కాలముదోషమే అయిననూ గురుని మూర్తివంతముచేత శుభఫలితముల నిచ్చును. గురుని పంచమరాశి సంచారకాలము సంపదలను పుత్రమూలక సౌఖ్యములను  కలిగించును. ముఖవర్చస్సు దేవతోపాసనతో పదిమందికి ఆదర్శవంతముగా ఆకర్షణంగా నిలుస్తారు. సంపదలను సృష్టిస్తారు. పుత్రపౌత్ర ప్రవర్థనము ధనధాన్య వివర్ధనముగా సాగును. ఈ రాశి వారికి శనైశ్చరుడున్నూ,  సంవత్సరమంతా  మూర్తిమంతము చేత సౌభాగ్యకరముగా యుండును.  శనిరాహుకేతువులు గోచారరీత్యా దుస్థానముల యందు సంచరించుచున్ననూ మూర్తిమంతముచే అత్యుత్తమ ఫలితము లీయగలరు. వాగ్వివాదములు సమసి కార్యజయము కలుగును. సంతానము ఇతర దేశముల యందు రాణించుట వారి ఉత్తీర్ణతకు సంబంధించి శుభవార్తలు వినుట జరుగును. విద్యార్థులు ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఉపాధ్యాయులకు సంవత్సర పూర్వార్థములో స్థలమార్పడికి అవకాశం, అధికారుల ఆగ్రహమునకు గురియగుట, ద్వితీయార్థములో గౌరవములు కలుగును. రైతులకు రెండవ పంట అనుకూలము. వ్యాపారస్తులకు నవంబరు నుండి అధిక లాభములు కలుగును. నటులకు గాయకులకు,  కళాకారులకు, క్రీడాకారులకు, న్యాయవాదు, వైద్యులకు, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, పాడిపరిశ్రమ, వృత్తి పనివారలకు సంవత్సర ఉత్తరార్థము అనుకూలము. ఆయా రంగములలోని వారికి గౌరవము గుర్తింపు కలుగును. ఏరంగములోని వారికైననూ సంవత్సర పూర్వార్థము కంటే ద్వితీయార్థమే అనుకూలము. గత సంవత్సరమువలె ఈ సంవత్సర పూర్వార్థములో ఆపదలు ఎదుర్కొనవలసి వచ్చును. బెబ్బర్లు దానం ఇవ్వడం అలాగే గోపూజ చేయుట సూచన. ప్రతిరోజూ లక్షీఅష్టోత్తర స్తోత్రం చదవడం మంచిది. వేంకటేశ్వర ఆలయం దర్శనం మంచిది.

తులరాశి : –

ఆదాయం : 14, వ్యయం : 11, రాజపూజ్యం : 7, అవమానం : 7

ఈ రాశివారికి గురుడు మార్చి 29వతేదీ నుండి 4లో జూన్‌ 29 వతేదీ నుండి 3లోమరియు నవంబర్‌ 20 నుండి 4లో మరియు తదుపరి ఏఫ్రిల్‌ 5వతేదీ నుండి 5లోసంచరించును. శని సంవత్సరమంతా 4లో సంచరించును. రాహుకేతువులు సంవత్సరాది నుండి సెప్టెబర్‌ 23 వరకు భాగ్య, తృతీయ స్థానములందు తదుపరి అష్టమ, ధనస్థానములందు సంచరించును.తృతీయ గురుని సంచారము వలన కార్య భంగము, చేసిన పనే మల్లి చేయవలసి వస్తుంది. గురుడు శుభఫలితములిచ్చు వాడగుట వలన జులై ప్రారంభము నుండి సుమారు 5 మాసములు ధైర్యముతో వ్యవహరించి సోదరుల సహాయముతో సకలకార్య సిద్ధి పొంది, పట్టినదంతా బంగారమై పురోగమనము శుభకార్య నిర్వహణ మొదలగు ఫలితములు కలుగును. ఈ రాశి వారికి గురుని తృతీయ రాశి సంచారకాలము ఆపదలను కలిగించును. అర్ధాష్టము స్థాన సంచారకాలము ధనవ్యయమును  ,తల్లి తరుపు వారితో విరోధములను కలిగించును, గాని జులై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నవంబర్‌ ఈ5 మాసములలోను గురుని మూర్తిమంతము చేత ధనవృద్ధి, భోగభాగ్యము అనుభవించుట మరియూ ఆశించిన శుభఫలితములు కలుగును. శని అర్దాష్టమ సంచార కాలం బంధువులతో విరోధంనకు అవకాశం వుంది. ఉదర సంబంధమగు అనారోగ్య సూచన. వైద్యసహాయము తీసుకోవలసి వుంటుంది. జీర్ణ సంబంధమగు ఇబ్బందులు తలెత్తును. రాహుకేతువులలో కేతు సంచారము బహు సౌభాగ్యకరముగా యుండును. ఈ రాశికి చెందిన విద్యార్థులు కష్టపడిన ఉత్తీర్ణులు కాలేరు. ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు స్థలమార్పిడికి అవకాశం వుంది పైఅధికారుల ఆగ్రహమునకు గురి కావలసివచ్చును. వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉండును . రైతులకు రెండుపంటలు సామాన్య ఫలతాలను ఇచ్చును. కళాకారులకు క్రీడాకారులకు గుర్తింపు తక్కువ. పాడి, పౌల్ట్రీ పరిశ్రమలు నత్తనడక నడచును. వైద్యులకు న్యాయవాదులకు సామాన్య కాలము. ఈరాశిలో ఎవరికైననూ సామాన్యఫలితములు కలుగును. ఆర్థిక ఆరోగ్య విషయములలో ముందు జాగ్రత్త తీసుకొనవలసిన అవసరము ఎంతైనా ఉంది. నల్లనువ్వులు దానం ఇవ్వడం అలాగే హనుమాన్ ఆలయం దర్శనం చేయుట సూచన. ప్రతిరోజు హనుమాన్ చాలీసా అలాగే శ్రీరామరక్షా స్తోత్రం చదవండి.

వృశ్చికరాశి : –

ఆదాయం : 5, వ్యయం : 5, రాజపూజ్యం : 3, అవమానం : 3

ఈరాశివారికి గరుడు మార్చి 29వతేదీ నుండి 3లో జూన్‌ 29వతేదీ నుండి 2లో మరియు నవంబర్‌ 20 నుండి 3లో తదుపరి ఏఫ్రిల్‌ 5వ తేదీ నుండి 4లో సంచరించును. శని సంవత్సరమంతా 3లో సామాన్య ఫలితముల నిచ్చును. రాహుకేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు అష్టమ, ధనస్థానములందు తదుపరి సప్తమ, జన్మస్థానములందు సంచరించును.ఏరంగము వారైననూ మనోధైర్యముతో, సదా క్రియాశీలముగా కార్యాభిలాషులై యుండుట. ఆనందముగా యుంగుట స్వప్రయత్నములచే తలచిన కార్యములు నెరవేరుట, హృదయమున సౌఖ్యము, శరీరసౌఖ్యము, స్వస్థానప్రాప్తిని పొందుతారు. ఆశించిన ఫలితములు సత్వరమే నెరవేరును. ఇష్టులగు వ్యక్తుల అభినందనలు పొందుతారు. ఈరాశి వారికి గురుని ద్వితీయ రాశి సంచారకాలము ధనలాభము కుటుంబ సౌఖ్యమును, తృతీయరాశి సంచారము సంపదలను కలుగజేయును. రాహువు అష్టమరాశి సంచారకాలములో మనోవ్యాకులత, దు:ఖములు, స్థలమార్పిడి, అనారోగ్యమును కలుగజేయును. రాహువు సప్తమరాశి సంచార కాలము భార్యభర్తల మధ్య సమస్యలకు ఆస్కారం వుంది కాస్త జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి విద్యార్థులు వార్షిక, పోటీ పరీక్షలయందు విజయములను సాధిస్తారు. ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పైఅధికారుల మన్ననలను పొందుతారు. రైతులకు మొదటి పంటతో పాటు రెండవ పంట కూడా అనుకూలించును. మొత్తంగా రైతులకు అనుకూలమైన కాలం. వ్యాపారస్తులకు ఆశించిన ధనఫలితములు, వస్తువుల ఎగుమతులు చేయువారు చాకచక్యముతో వ్యవహరించిన ధన లాభములు కలుగును. కళాకారులకు, క్రీడాకారులకు, సమాజములో గుర్తింపు గౌరవము, వ్యవసాయము, పాడి, పౌల్ట్రి, మత్స్య పరిశ్రమలవారు లాభములను పొందుతారు. వైద్యులు, న్యాయవాదులు ఆధునిక విజ్ఞాన సముపార్జనతో పాటు పరిశోధన వ్యాసంగములలో వృద్ధిని సాధిస్తారు. వృత్తి పనివారలకు ధనలాభము. ఈ రాశిలో ఎవరికైననూ సంవత్సర పూర్వార్థములో అత్యంత సౌఖ్యములు, లాభములు కలుగును. ద్వితీయార్థములో రాహుకేతువుల ప్రభావముచే కార్యవిలబనము కలుగును. లాభార్జన కలుగును. శివాలయం దర్శనం అలాగే ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మంచిది. నల్లనువ్వులు అలాగే మినుములు దానం ఇవ్వడం సూచన.

ధనూరాశి : –

ఆదాయం : 8, వ్యయం : 11, రాజపూజ్యం : 6, అవమానం : 3

ఈరాశివారికి గురుడు మార్చి 28వతేదీ నుండి 2లో జూన్‌ 29వతేదీ నుండి 1లోమరియు నవంబర్‌ 20 నుండి 2లో తదుపరి ఏఫ్రిల్‌ 5వ తేదీ నుండి 3లోసంచరించును. శని సంవత్సరమంతా 2లో సంచరించును. రాహుకేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు సప్తమ, జన్మస్థానములందు తదుపరి షష్ఠ, వ్యయస్థానములందు సంచరించును.ఈ రాశి వారికి పై అధికారుల వలన ఇబ్బందులు, ఒత్తిడి అధిగమించలేకపోవుట, కార్యములు చెడుట, బుద్ధి కుశలత లేకపోవుట, సంపదహాని వృత్తి ఉద్యోగములలో ఆందోళనలు, అధిక శ్రమచే స్వల్ప లాభములు, తగినంత లాభములు రాకపోవుట సంభవించును. ఈ రాశి వారికి జన్మ గురుని సంచార కాలములో స్థలమార్పిడి, అనారోగ్యము, పుణ్యక్షేత్ర దర్శనములు, సాధుజన సేవనము, నిరంతరము ఆధ్యాత్మిక గ్రంథ పారాయణాలు చేయుదురు. గురుని ధన స్థాన సంచారకాలము ధన లాభమును కుటుంబ సౌఖ్యమును కలుగుజేయును. శని, రాహు కేతువుల ప్రభావము వలన ధననష్టము, కుటుంబ కలహములు, భయము, భార్యభర్తల మధ్య సమస్యలకు ఆస్కారం వున్న గురు శనులు మూర్తిమంతముచే శుభఫలితములు కలుగును. దోషములు తొలగి సమస్తైశ్వర్యములు కలుగును. సంవత్సర ద్వితీయార్థములో సుఖ సౌఖ్యములను శత్రుజయమును కలిగించును. ఈ రాశివారికి సంవత్సర ద్వితీయార్థములో గురు బలము కలదు. విద్యార్థులు సంవత్సర ద్వితీయార్థములో కష్టపడటం వలన ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికారుల మన్ననలు, ప్రశంసలు పొందుతారు. రైతులకు రెండు పంటలు అనుకూలించును, వ్యాపారస్తులకు సంవత్సర ద్వితీయార్థములో లాభములు. పాడి, మత్స్య, పౌల్ట్రీల వారికి సంవత్సర ద్వితీయార్థములో ప్రోత్సాహకరముగా ఉండును. వృత్తి పనివారలకు, గాయకులకు, క్రీడాకారులకు, పండితులకు మిక్కిలి ప్రోత్సాహకరముగా ఉండును. న్యాయవాదులకు, వైద్యులకు ఉత్తరార్థములో లాభసాటిగా ఉండును. ఏలినాటి శని ప్రభావము మూడవ మరియు ఆఖరి భాగమునకు వచ్చుట వలన గతము కంటే కొంతమేరకు ఉపశమనము అయిననూ జాగ్రత్త అవసరము. శనగలు దానం ఇవ్వడం అలాగే గణపతి పూజ చేయుట మంచిది. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవండి.

మకరరాశి : –

ఆదాయం : 11, వ్యయం : 5, రాజపూజ్యం : 2, అవమానం : 6

ఈరాశివారికి గురుడు మార్చి 29 వతేదీ నుండి 1లో జూన్‌ 29వతేదీ నుండి 12లో మరియు నవంబర్‌ 20 నుండి 1లోతదుపరి ఏఫ్రిల్‌ 5వతేదీ నుండి 2లో సంచరించును. శని సంవత్సరమంతా 1లో సంచరించును. రాహుకేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు షష్ఠ వ్యవస్థానములందు, తదుపరి పంచమ, లాభసాధనము లందు సంచరించును. ఈరాశివారికి జన్మరాశి యందు శనైశ్చరుని సంచారము వలన విపత్తుల సూచనలు ఉన్ననూ, స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండుట చేత అన్నింటిని అధిగమించగలరు. మరియు రాహు కేతువులున్నూ గోచారస్థితచే దోషప్రదములైననూ పూజాదికార్యాలు చేయుట చేత అలాగే ప్రణాళిక వలన దోషములను తొలగించి శుభఫలితములను కలుగుజేసెదరు. కావున దోషము లేవనియూ మంచి జరుగుననియూ తెలియచున్నది. గురుని వ్యయరాశి సంచారము కాలములో శుభమూలక ధనవ్యయమున్నూ, జన్మరాశి సంచారకాలములో ఆకస్మిక స్థలమార్పిడి, పనుల ఒత్తిడి, నోటిపూత, మెడ, తల, నరముల నొప్పులు అనారోగ్యము కలుగును. తీర్థయాత్రలు చేయుదురు. శని జన్మరాశి సంచారకాలములో అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఎముకలు విరుగుట, హానిజరుగుటకు అవకాశమున్ననూ గురు శనుల విశేష యుతి వలన  దోషనివారణ అయి మంచి ఫలితములు కలుగును. అవివాహితులకు వివాహము జరుగును. రైతులకు రెండుపంటలు తగు మాత్రముగా కలసి వచ్చును. వ్యాపారస్తులకు సామాన్య లాభములు కలుగును. కళాకారులకు, న్యాయవాదులకు, వైద్యులకు ఆశించిన ప్రోత్సాహములు లభించవు. పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమలు వారికి మధ్య మధ్యలో ఇబ్బందులు చవిచూడవలసి వచ్చును. వృత్తి పనివారలకు ధనలాభము కలుగును, రాజకీయ నాయకులకు పరీక్షాకాలము క్రీడాకారులకుతగిన గుర్తింపు కలుగును. మినుములు అలాగే పెసలు దానం ఇవ్వడం మంచిది. గణపతి ఆలయం దర్శనం తరుచు అభిషేకం చేయుట సూచన.

కుంభరాశి : –

ఆదాయం : 11, వ్యయం : 5, రాజపూజ్యం : 5, అవమానం : 6

ఈరాశివారికి గురుడు మార్చి 29వతేదీ నుండి 12లో జూన్‌ 29వతేదీ నుండి 11లో మరియు నవంబర్‌ 20 నుండి 12లోతదుపరి ఏఫ్రిల్‌ 5వతేదీ నుండి 1లోసంచరించును. శని సంవత్సరమంతా 12లో సంచరించును. రాహుకేతవులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు పంచమ, లాభస్థానములందు తదుపరి చతుర్థ , దశమ స్థానమలుందు సంచరించును.ఈరాశి వారికి గురుని లాభస్థాన సంచార కాలములో సంతోషము, కీర్తివృద్ధి, బలము, తేజస్సు, సర్వత్రా జయము, సభాగౌరవము, శత్రునాశనము, దేవతారాధన, మంత్రసిద్ధి కలుగును. ధనము నిల్వ చేయుదురు. గురుని ద్వాదశ స్థాన సంచారకాలములో శుభకార్యములు చేయుటచే వ్యయము, గృహమున మంగళ తోరణములు, అలంకరణ వస్తువులు కొనుటకు దుబారాఖర్చులు చేయుట జరుగును. శని వ్యయరాశి సంచారకాలము శారీరక మానసిక పీడలను కలిగించుట, మనోవ్యథ, అశాంతి కలిగించును.  శనిశుభఫలముల నీయజాలడు. దోష పరిహారార్థం మందపల్లిలో లేక శనైశ్చర క్షేత్రంలో తైలాభిషేకములు చేయుట మంచిది. రాహుకేతువుల ఫలితములు సామాన్యముగనేయున్నవి. వాగ్వివాదములకు దూరముగా యుండుట మంచిది. ఇతరుల విషయములో జోక్యముచే భంగపడవలసి వచ్చును. కార్యహాని కలుగును. ఈ రాశివారికి సంవత్సర పూర్వార్థములో గురు కేతు బలములు అనుకూలము. ఈరాశివారికి ఏల్నాటి శని ప్రారంభమైననూ శ్రీవేంకటేశ్వరారాధనచే సమస్త దోషముల నుండి ఉపశమనము కలుగును. విద్యార్థులు అధిక ఒత్తిడి తట్టుకుని ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులగుదురు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంవత్సరారంభములో అధికారుల ప్రశంసలు మన్ననలు పొందుతారు. ప్రతిభా పురస్కారములు పొందుతారు. రైతులకు మొదటి పంటఅనుకూలము. రెండవ పంట సామాన్యము. పాడిపంటలు అనుకూలము. మత్స్య, పౌల్ట్రీ యజమానులకు సం.. పూర్వార్థములో ప్రోత్సాహకరముగా ఉండును. గాయకులకు, నటీనటులకు కూడా పూర్వార్థమే అనుకూలము. ఉత్తరార్థము సామాన్యము. న్యాయవాదులకు, రాజకీయ నాయకులకు సన్మానములు జరుగును. లక్ష్మీనరసింహ ఆలయం దర్శనం అలాగే కవచం చదవడం మంచిది. పెసలు అలాగే మినుములు దానం సూచన.

మీనరాశి : –

ఆదాయం : 8, వ్యయం : 11, రాజపూజ్యం : 1, అవమానం : 2

ఈ రాశి వారికి గురుడు మార్చి 29వతేదీ నుండి 11లో జూన్‌ 29 నుండి 10లో మరియు నవంబర్‌ 20 నుండి 11లోతదుపరి ఏఫం్రిల్‌ 5వ తేదీ నుండి 12లోసంచరించును. శని సంవత్సరమంతా 11లోసంచరించును. రాహుకేతువులు సంవత్సరాది నుండి సెప్టెంబర్‌ 23 వరకు చతుర్థ దశమ స్థానములందు తదుపరి తృతీయ భాగ్యస్థానము నందు సంచరించును. ఈ రాశి వారికి రాజ్యస్థాన సంచార కాలమున సర్వకార్య విజయము, గౌరవ సన్మానాదులు, పుత్ర సౌఖ్యము, బంధువులతో విరోధమునకు అవకాశమ ఉన్నది. గురుని లాభస్థాన సంచారకాలములు శని లాభస్థాన సంచార కాలమున శరీరారోగ్యము , ధనధాన్య కీర్తి, లాభములు, భూములు కొనుగోలు పుత్ర పుత్రికా విషయమై విశేష సుఖము, మనోనిర్మలత్వము, అభీష్ట సిద్ధి, ఉద్యోగ ఉన్నతి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, భూగృహాదులను మార్పుచేయుట వలన లాభం పొందుతారు. సంస్థలకు ఆధిపత్యం వహించువారు సంస్థలను ప్రగతి పథములో నడిపిస్తారు. రాహువు అర్దాష్టమ రాశి సంచారకాలములో వ్యాధులకు గురియగుట వైద్యసహాయము, ఔషధ సేవనము, రాహువు తృతీయ రాశి సంచార కాలములో సర్వ సౌఖ్యములుకలుగును. రాహుకేతువుల ప్రభావము మొత్తము మీద ద్వితీయార్థములో అనుకూలము. గురుశని బలము కలదు అన్ని రంగముల వారికి ఈ సం.. అభివృద్ధి పథములో నడచును. విద్యార్థులు వివిధ పోటీలలో పాల్గొని ప్రతిభ ప్రదర్శిస్తారు. ఉపాధ్యాయులకు పురస్కారములు, ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. రైతులకు రెండు పంటలు కలసి వచ్చును. వ్యాపారస్తులకు సం.. మంతయూ లాభముల బాటలో నడచును. న్యాయవాద, వైద్య, రక్షణ రంగాల అధికారులు విశేష ప్రతిభను ప్రదర్శించి గౌరవ లాభములను పొందగలరు. వ్యవసాయ, పాడి, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల యజమానులు ఇంతకు ముందెన్నడూ లేని ధనమును పొందుతారు. వృత్తి పనివారికి మిక్కిలి ప్రోత్సాహకరమగు కాలము. రాజకీయ నాయకులకు బాగుంటుంది. ప్రతిరోజూ గణపతి అష్టోత్తరం చదవడం మంచిది. శివాలయం అలాగే గణపతి ఆలయం దర్శనం సూచన. మినుములు దానం ఇవ్వండి.

UGADI PANCHANGAM 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here