5K ఇవ్వలేదని మేనకోడలిని బండకు కొట్టిన రాక్షసుడు 

Spread the love

uncle killed neice for 5k

కేవలం ఐదు వేల రూపాయల కోసం  సొంత మేనకోడలిని అత్యంత దారుణంగా హతమార్చాడు నల్గొండ జిల్లాకు చెందిన ఉపేందర్ అనే మానవ మృగం.  బండి రిపేర్ చేయించుకోవడానికి డబ్బు ఇవ్వలేదన్న కారణంతో విచక్షణ కోల్పోయి పాపని ఎత్తి బండకేసి కొట్టాడు.  దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాలను చూస్తే.  ఐదు వేల రూపాయలు  అడిగితే తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి రాక్షసుడిలా ప్రవర్తించాడు. ముక్కు పచ్చలారని తన మేన కోడలును బండకేసి కొట్టి చంపాడు. పెద్దవూర మండలం చిన్నగూడెంలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మి కాన్పు కోసం 4నెలల క్రితం తల్లిగారింటికి వచ్చింది. గురువారం పెద్ద కుమార్తె ఝాన్సీరాణి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని అత్తవారింటికి వెళ్లడానికి సిద్ధమైంది. కానీ ఆమె సోదరుడు ఉపేందర్‌ ద్విచక్రవాహనం రిపేర్‌ ఉండటంతో ఆగిపోయింది. వాహనం రిపేర్‌ కోసం ఉపేందర్‌ తల్లిదండ్రలను రూ. 5 వేలు అడిగాడు. వారు డబ్బులు ఇవ్వలేదు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపేందర్‌.. సోదరి లక్ష్మి నిద్రిస్తున్న సమయంలో చిన్నారి ఝాన్సీరాణిని ఎత్తుకొని బండకేసి కొట్టాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు ఉపేందర్‌ను పట్టుకొని స్తంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. క్షణికావేశం ఆ యువకుడ్ని హంతకుడిగా మార్చి కటకటాలపాలు చేసింది.

TAGS: uncle killed neice for 5k, WOMEN BABY KILLINGS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *