అత్యాచారాలు, హత్యలపై సంచలన నిర్ణయం తీసుకున్న యూపీ సర్కార్

UP Sarkar Sensational Decision On Rape And Murder
దేశంలో ఇటీవల కాలంలో అత్యాచారాలు హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళలకు భద్రత గాల్లో దీపంలా మారుతోంది. తెలంగాణలో దిశ, ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ లో రేప్ బాధితురాలు సజీవ దహనం దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దీంతో యూపీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. దిశ కేసు నిందితులను ఎన్కౌంటర్ జరిగిన రోజు మాయావతి యూపీలోని బిజెపి సర్కార్ తెలంగాణ పోలీసులు చూసి, తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం చూసి బుద్ధి తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఇక ఉన్నావ్ రేప్ బాధితురాలి మరణం తర్వాత నిన్ను ముట్టిన నిరసనలతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులను వేగంగా విచారించేందుకు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యాచారాల కేసులకు 144 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పిల్లలపై నేరాలకు 74 కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని కాల్చిచంపిన వైనంపై యూపీ సీఎం యోగిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం అసమర్థతపై అందరూ దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దారుణాలపై కఠిన శిక్షలు పడేలా యోగి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *