‘అర్బన్ రైజ్’ అక్రమం?

13
URBAN RISE UDS SALES?
URBAN RISE UDS SALES?

URBAN RISE UDS SALES?

urbanrise-bachupally

జీహెచ్ఎంసీ నుంచి నో పర్మిషన్..

రెరా నుంచి తీసుకోని అనుమతి

యూడీఎస్ విధానంలో అక్రమంగా అమ్మకాలు

చెన్నైకి చెందిన ‘అర్బన్ రైజ్’ సంస్థ హైదరాబాద్లో సరికొత్త అక్రమానికి తెర లేపింది. జీహెచ్ఎంసీ, రెరా అథారిటీల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బాచుపల్లిలో కొత్త ప్రాజెక్టులో ఫ్లాట్ల విక్రయాల్ని ఆరంభించింది. ముందే వంద శాతం సొమ్ము కడితే చదరపు అడుక్కీ రూ.3,499కే అందజేస్తానని ఇన్వెస్ట్ మెంట్ ఆఫర్ అంటూ ప్రకటించింది. రెరా అనుమతి వచ్చాక రేటును ఎలాగూ పెంచుతాం కాబట్టి, ఇప్పుడు వంద శాతం సొమ్ము కడితే చదరపు అడుక్కీ రూ.3,499కే అమ్ముతున్నామని అమాయక కొనుగోలుదారులకు టోపి పెట్టే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్లో ఛానెల్ పార్టనర్ల ద్వారా ఇలాంటి అక్రమ విధానంలో ఫ్లాట్లను అమ్మకాన్ని ఈ సంస్థే శ్రీకారం చుట్టిందని సమాచారం. 

అసలెందుకు ఇలాంటి జిమ్మిక్కులు?

కేవలం అర్బన్ రైజ్ మాత్రమే కాదు.. హైదరాబాద్లో అనేక సంస్థలు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను అమ్ముతున్నాయి. ఆ జాబితా మొత్తం టీఎస్ న్యూస్ వద్ద ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆధునిక ఆవిష్కరణల్లో ముందున్నట్లే.. కొందరు బిల్డర్లు భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అక్రమ పద్ధతుల్లో ఫ్లాట్లను అమ్ముతున్నారు. ఎంత దారుణమంటే.. జీహెచ్ఎంసీ, రెరా అథారిటీ నుంచి అనుమతి లేకుండా నిస్సిగ్గుగా విక్రయిస్తున్నారు. ఒకవైపు స్థలం కొనుగోలు చేశామని ఈ సంస్థ చెబుతూనే మరోవైపు ఎందుకిలా అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను విక్రయిస్తుంది? అసలు హైదరాబాద్లో యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు విక్రయించమని ఈ సంస్థకు చెప్పిందెవరు? పోనీ కొనుగోలుదారులు యూడీఎస్లో అయితేనే కొనుగోలు చేస్తామని అంటున్నారా? లేదే.. మరి, ఇలా అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మడమెందుకు? 

నిర్మాణ సంఘాలు బహిష్కరించాలి..

హైదరాబాద్లో పేరెన్నిక గల అనేక నిర్మాణ సంస్థలు స్థానిక సంస్థలు, రెరా అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నాకే ఫ్లాట్లను విక్రయిస్తుంటాయి. కానీ, గత రెండు మూడేళ్ల నుంచి పలు నిర్మాణ సంస్థలు ఇలా అక్రమ బాట పట్టాయి. వంద శాతం సొమ్ము చెల్లిస్తే మార్కెట్ రేటు కంటే సగానికే ఫ్లాట్లను అందజేస్తామని చెబుతున్నాయి. అర్బన్ రైజ్ తో పాటు అనేక నిర్మాణ సంస్థలు మోసానికి పాల్పడుతున్నాయి. అందుకే, ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా ఫ్లాట్లను అమ్మే సంస్థలకు క్రెడాయ్ హైదరాబాద్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ వంటి సంఘాలు సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మే సంస్థల సభ్యత్వాన్ని తొలగించాలి. పైగా, తెలంగాణ రెరా అథారిటీ కూడా ఇలా అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలి. లేకపోతే నిజాయితీగా ఫ్లాట్లను కట్టే సంస్థలకు, అక్రమ కంపెనీల మధ్య తేడా ఉండదు. 

Satya, Principal Correspondent
(editor.tsnews@gmail.com)

#UrbanRise

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here