కాంగ్రెస్ లో చేరిన బాలీవుడ్ తార ఊర్మిళ

Bollywood actress Urmila Joined in Congress

రంగీలా సినిమాతో ప్రేక్షక హృదయాలను దోచుకున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళా మటోంద్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.మార్చి-27,2019 ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ముంబై నుండి ఆమె ఎన్నికల బరిలోకి దిగుతారని తెలుస్తుంది. తన కుటుంబం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఫాలో అయ్యేదని,వారి అడుగుజాడల్లో నడిచి తాను కాంగ్రెస్ లో చేరినట్లు ఈ సందర్భంగా ఊర్మిళా తెలిపింది.
చాలా ఏళ్లుగా ఊర్మిలా తనకు తెలుసునని,ఆమె దేశంలో అతికొద్దిమంది గొప్ప ఆర్టిస్ట్ లలో ఒకరు మాత్రమే కాకుండా ఆమె సమాజంలో జరగుతున్న పరిణామాల పట్ల తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేదని, కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశానికి సేవ చేయవచ్చని నమ్మి ఆమె తమ పార్టీలో చేరారని ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా తెలిపారు.ఏప్రిల్ నెలలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం. చూడాలి ఈ బాలీవుడ్ తార చరిష్మా కాంగ్రెస్ కు ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *