ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మపై ఉత్తమ్ ఫైర్

Uttam Fire on RTC Incharge MD Sunil Sharma

ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ కోర్టులో వేసిన అఫిడవిట్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన వేసిన అఫిడవిట్‌పై ఆయన తీవ్ర అభ్యంతంరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వాన్ని ఎవరు కూల్చుతున్నారో చెప్పాలని… ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మె వల్ల ప్రజలతో పాటు ప్రభుత్వం కూడ ఇబ్బంది పడుతుందని కోర్టుకు తెలిపారు. నలబై రోజులుగా చేస్తున్న సమ్మె వల్ల రాష్ట్ర అభివృద్ది అగిపోతున్న నేపథ్యంలో త్వరగా ఆదేశాలు జారీ చేయాలని అఫిడవిట్‌లో కోరాడు. దీంతో ఐఏఎస్ అధికారులు ప్రతిపక్షాల గురించి పేర్కొనడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. తాము ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎలాంటీ ఆలోచన చేయలేదని పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సునీల్ శర్మ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌ను విచారించి సుమోటాగా స్వీకరించాలని చర్యలు చేపట్టాలని కోర్టును కోరారు. పార్టీ సీనియర్ నేతలు హనుమంతరావు, మరియు పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన ఎండీ సునీల్ శర్మపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నినట్టు ఆధారాలు ఉంటే వెంటనే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు. లేదంటే… అఫిడవిట్ వేసిన సునీల్ శర్మనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత జాగీర్‌లాగా భావిస్తున్నారని అన్నారు. ఇక ఆర్టీసీ సమస్యను లోక్‌సభలో లేవనెత్తడంతోపాటు సునిల్ శర్మ వేసిన అఫిడవిట్ పై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

tags : rtc md, sunil sharma, congress leader, uttam kumar reddy, high court

హైదరాబాద్ దేశ రెండో రాజధాని చర్చ పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

67 రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ పై విడుదలైన చింతమనేని ప్రభాకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *