పవన్ కళ్యాణ్ చాలా దూరం వెళ్లాడు

vakeel saab release date

సినిమాల విజయాలతో పనిలేకుండా ప్రేక్షకుల్లోనూ ఫ్యాన్స్ లోనూ క్రేజ్ తగ్గని స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకడు. ఆ అభిమానం ఓట్లుగా మారుతుందనుకుని పార్టీ పెట్టి మరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ కథ లేని సినిమాలా క్లారిటీ లేని పవన్ పొలిటికల్ ఎజెండాను జనం తిరస్కరించాడు. అయినా ప్రజల్లోనే ఉంటూ సమస్యల కోసం పోరాటం చేస్తా అంటూ అప్పుడప్పుడూ ట్వీట్స్ లో ప్రశ్నిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్.అయితే గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి చూసిన తర్వాత తర్వాతి ఎన్నికలకు చాలా టైమ్ ఉంది కాబట్టి మళ్లీ వెండితెర వైపు వచ్చాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’లో నటిస్తున్నాడు. ఒక రకంగా రీ ఎంట్రీ అనదగ్గ టైమ్ లో ఇలాంటి చిత్రం ఎంచుకోవడం అభిమానులకూ నచ్చలేదు. కానీ ఫ్యాన్స్ కోసం కథలో కమర్షియల్ మార్పులు చేశాం అంటున్నారు. హీరోయిన్ కూడా ఉంది. మామూలుగా వకీల్ సాబ్ మే నెలలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ తో కొంత షూటింగ్ ఉండగానే ఆగిపోయింది. ఈ చిత్రానికి ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. అందులో ఓ పది రోజులు హీరోయిన్ శ్రుతి హాసన్ నటించాల్సి ఉంది. అయితే మళ్లీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది క్లారిటీ లేకపోవడంతో విడుదల డేట్ ను మాత్రం ఫిక్స్ చేసుకున్నాడు వకీల్ సాబ్.

ఇందుకోసం అన్నయ్య కాదనుకున్న డేట్ ను ఆక్యుపై చేస్తున్నాడు. అంటే వకీల్ సాబ్ రిలీజ్ డేట్ లో ముందుగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’మూవీ విడుదల కావాలి. కానీ ఆ సినిమాకూ చాలా రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది. కాబట్టి.. ఆ డేట్ లో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఇంతకీ ఆ డేట్ ఏంటో చెప్పలేదు కదూ.. 2021 సంక్రాంతి బరిలో నిలిచాడు వకీల్ సాబ్. యస్.. అంటే చాలా దూరం వెళ్లిపోయినట్టే కదా. 20 రోజుల షూటింగ్ అంటే పెద్ద విషయం కాదు. నెల రోజులకు పైగా షూటింగ్ చేసినా.. ఇప్పటి వరకూ అయిన టాకీ పార్ట్ అంతా ఎప్పుడో పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేశారు. మిగిలిన ఈ పార్ట్ ను ఫినిష్ చేయడం చాలా సులువు. అంటే వీళ్లు కావాలనుకుంటే ఖచ్చితంగా దసరాకే సినిమా విడుదల చేయొచ్చు. కానీ అప్పటికే థియేటర్స్, బిజినెస్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేరు. అందుకే ఎందుకైనా మంచిదని సంక్రాంతి వరకూ చాలా దూరం వెళ్లిపోయాడు వకీల్ సాబ్. అన్నట్టు ఈ డేట్ లో మార్పులేం ఉండవు. ఇది ఫిక్స్.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *