టీడీపీ నేతను బండ బూతులు తిట్టిన వల్లభనేని వంశీ

Vallabhaneni Vamshi bad comments On Rajendraprasad

టీడీపీ ని వదిలి వైసీపీలోకి వెళ్తానని ప్రకటించిన వల్లభనేని వంశీ నిన్న చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక అంతే కాదు నియంత్రణ మరచి వల్లభనేని వంశీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఒక టీవీ చర్చా కార్యక్రమంలో బాబు రాజేంద్రప్రసాద్ పైన పరుష పదజాలంతో, చెప్పరాని విధంగా ఆయన తిట్టిన తిట్లు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. టిడిపి శ్రేణులు సైతం నివ్వెరపోయేలా రెచ్చిపోయిన వల్లభనేని వంశీ టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ ను అరేయ్ అంటూ మాట్లాడటమే కాకుండా చెత్త నా కొడకా అంటూ నోటికొచ్చిన విధంగా తిట్టారు.
అసలు ఇంతకీ వల్లభనేని వంశీ ఎందుకు ఇంతగా సహనం కోల్పోయారు. ఎందుకు ఇంతగా టిడిపి నేత బాబు రాజేంద్రప్రసాద్ పై విరుచుకు పడ్డారు అంటే టీవీ చర్చా కార్యక్రమంలో బాబు రాజేంద్రప్రసాద్ వల్లభనేని వంశీని అన్ని విధాల చంద్రబాబు ఆదరించారని రాజకీయ జీవితాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు.వల్లభనేని వంశీకి అయన తండ్రిని జన్మనిస్తే, చంద్రబాబు నాయుడు రాజకీయ జన్మనిచ్చారని తెలుగు దేశం పార్టీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యామిలికి దగ్గర అయిన దాసరి కుటుంబాన్ని పక్కనబెట్టి వంశీకి చంద్రబాబు సీటిచ్చారని చెప్పుకొచ్చారు. డెల్టాకు రావాల్సిన పోలవరం కుడి కాల్వ నీటిని మోటార్ల ద్వారా వంశీ తరలించడానికి ప్రయత్నిస్తే దేవినేని ఉమా మోటార్లు అపుడే పెట్టొద్దన్నారని గుర్తు చేసారు. కానీ చంద్రబాబు నాయుడు దీని అంగీకరించారు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
అయితే లైవ్ లోకి వెంటనే వచ్చిన వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, రాజేంద్ర ప్రసాద్ పై తిట్ల దండకం అందుకున్నారు. డొక్క పగులుద్ది, నోరు మూస్కొవోయ్, ఎవరి పొలానికి నీళ్లు ఇచ్చార్రా చెత్త నా కొడకా , నోరు ముయారా, ఒంటి కన్నుగా, చెత్త వెదవ, చెప్పు తెగుతుంది రాజేంద్ర అని అన్నారు. నోర్ముయ్య్ రా, ఏది పడితే అది మాట్లాడితే కరెంటు అంతే కాకుండా జోకర్, బఫున్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయ్యప్ప మాల వేసుకున్న ప్పటికీ విచక్షణ మరచి వల్లభనేని వంశీ తిట్టిన తిట్లకు టిడిపి నేత రాజేంద్రప్రసాద్ సైతం అవాక్కయ్యారు. సంస్కారంతో మాట్లాడాలని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ ఎవరెన్ని చెప్పినా వినకుండా అలాగే తన పంధా కొనసాగించడం, ఆగ్రహంతో ఆగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

tags : Vallabhaneni Vamshi, MLA, Gannavaram,TDP MLC, Elamanchili Rajendraprasad, abuses

AP POLITICS

డిప్రెషన్ తో ఆర్టీసీ కార్మికుడు మృతి

దోస్త్ కటీఫ్ అంటున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *