సోషల్ మీడియా దుష్ప్రచారంపై  వల్లభనేని వంశీ  ఫిర్యాదు  

Vallabhaneni Vamshi complaint On Social Media

మార్ఫింగ్ ఫోటోలతో, అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై వల్లభనేని వంశీ విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.  విజయవాడ పోలీస్ కమిషనర్ తిరుమలరావు కలిసిన వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ అనుబంధ పేజీల నుండి  తనను టార్గెట్ చేస్తూ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారని ఆరోపించారు. ఫేస్బుక్, ట్విట్టర్ లను వేదికగా చేసుకొని తనపై అసత్య ప్రచారానికి దిగారని ఆయన పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన తన ఫిర్యాదు లేఖలో  పేర్కొన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కు అందజేసినట్లు గా తెలుస్తుంది. తనను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్న టిడిపి నేతలపై  వల్లభనేని వంశీ  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరుగా తన ను ఎదుర్కోలేని వారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారని వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టిడిపి నేతలను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు దగుల్బాజీ లు, సన్నాసులు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు వల్లభనేని వంశీ. అంతేకాదు తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన విజయవాడ సి పి తిరుమల రావును కోరారు.

tags : Vallabhaneni Vamshi, MLA, Gannavaram,social media, posts, complaint, vijayawada cp, tirumala rao, TDP, Chandrababu, nara lokesh

టీడీపీ నుండి వల్లభనేని వంశీ సస్పెన్షన్

సూతిల్ తాడు కు డబ్బులా?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *