Vallabhaneni Vamshi Suspension From TDP
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వంశీమోహన్ రాజీనామా చేసినప్పటికీ చంద్రబాబు వంశీ మోహన్ రెండుసార్లు రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. అయినప్పటికీ వంశీ తెలుగుదేశం పార్టీలో కొనసాగేది లేదని తేల్చి చెప్పారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు సైలెంటుగా ఉన్న వంశీ నిన్నటికి నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు పైన, లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు టిడిపి ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ను, అలాగే కొందరు టీడీపీ ముఖ్య నేతలను నోటికొచ్చినట్లు గా తిట్టారు. చెప్పుతో కొడతా చెత్త నా కొడకా అంటూ పరుషపదజాలం ఉపయోగించి ఇష్టారాజ్యంగా మాట్లాడిన వంశీ మోహన్ ను తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. మీడియాతో వంశీ మాట్లాడుతూ, తాను వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని, జగన్ వెంటే నడుస్తానని, త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, వంశీ అంశాన్ని టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. వంశీ అంశంపై ఈ రోజు చర్చించిన చంద్రబాబు… ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.
ఇక నిన్నటికి నిన్న చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించిన వంశీ జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేసారని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కి దూరంగా ఉండటానికి కారణం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇక నారా లోకేష్ చెప్పిన మాట మేం వినాలా అంటూ నిలదీశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కొంతైనా సమయం ఇవ్వకుండా దీక్షల పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక ఇదే సమయంలో యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ పై కూడా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు వంశీ. ఇక వంశీ తీరుతో చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
tags : Vallabhaneni Vamshi, MLA, Gannavaram, TDP MLC, Elamanchili Rajendraprasad, abuses, Chandrababu, nara lokesh, suspension
జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు