గోవాకి వర్మ.. ఈ సారి మోతే..?

5
varma shifted to goa
varma shifted to goa

varma shifted to goa

కంట్రీ కాంట్రవర్శీయల్ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. కొన్నాళ్లుగా చిన్న తరహా బూతు సినిమాలతో ఆడియన్స్ ను రకరకాల యాంగిల్స్ లో టార్చర్ చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మంచి దర్శకుడు. కానీ ఇప్పుడు వెర్రి దర్శకుడైపోయాడని అతని సహచర సినిమా వాళ్లే చెబుతున్నారు. అతన్లాంటి గ్రేట్ మేకర్(..??)పై ఇప్పుడు అప్ కమింగ్ వాళ్లు, సినిమా పరిజ్ఞానంలో ఓనమాలు తెలియని వాళ్లు కూడా సినిమాలు చేస్తున్నారు. ఈ స్థాయికి పడిపోయాడు వర్మ. అయినా తన బూతు సినిమాలను ఆపేది లేదంటూ సరికొత్త ప్లానింగ్ తో హైదరాబాద్ నుంచి తన ఆఫీస్ ను గోవాకు షిఫ్ట్ చేశాడట. యస్ కొన్నాళ్ల క్రితమే రామ్ గోపాల్ వర్మ గోవాలో ఓ కొత్త ఆఫీస్ తీశాడు. హైదరాబాద్ లో కరోనా కేస్ లు పెరుగుతున్నాయి. గోవాలో లేవు అనే కారణంతో అతను అక్కడికి వెళ్లలేదు. చాలా పెద్ద ప్లాన్ తోనే మనోడు గోవాలో తిష్ట వేశాడట.

రీసెంట్ గా థ్రిల్లర్ పేరుతో చేసిన కెమెరా యాంగిల్స్ కు జనం నుంచి ఏ మాత్రం రెస్పాన్స్ రాలేదు. అందుకే ఆ సారి మరింత జాగ్రత్తగా మంచి యాంగిల్స్ ను ప్లాన్ చేసుకుని అక్కడ ఏకంగా ఆరు సినిమాలు రూపొందించేలా ప్లాన్ చేసుకున్నాడట. సినిమాలంటే వెండితెరపై చూసేవి కావు.. వర్మ సొంత ఓటిటిలో చూపేవి అన్నమాట. అంటే అవి అరంగంట నుంచి గంటలోపే పూర్తవుతాయి. ఇలాంటి కంటెంట్ తో ఆరు  సినిమాలు రూపొందించి ఒకేసారి దాడి చేయబోతున్నాడని టాక్. ఈ ఆరు సినిమాలు పూర్తి కాగానే వారానికోటి చొప్పున ఓటిటిలోకి వదలబోతున్నాడంటున్నారు. ఏదేమైనా ఇలాంటి పాండమిక్ టైమ్ ను కూడా వాడుకుని డబ్బులు సంపాదించడం ఎలాగో వర్మను చూసే నేర్చుకోవాలేమో.

tollywood news