మళ్లీ కలుస్తున్నారా ముకుందా..?

Varun Tej To Team Up With Srikanth Addala Again

వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతోన్న మెగా హీరో వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ముకుందా. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోకపోయినా వరుణ్ కు పర్ఫెక్ట్ లాంఛ్ అనిపించుకుంది. స్మాల్ టౌన్ ఇష్యూస్ తో సాగిన ఈ సినిమాతోనే నేటి టాప్ హీరోయిన్ పూజాహెగ్డే కూడా పరిచయం కావడం విశేషం. ఇప్పుడు వరుణ్ మెగా క్యాంప్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సెట్ చేసుకున్నాడు. అటు శ్రీకాంత్ ఒక్క డిజాస్టర్ తో కిలోమీటర్లు వెనక్కి వెళ్లి ఫైనల్ గా వెంకటేష్ హీరోగా తమిళ్ హిట్ మూవీ అసురణ్ ను తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ రాకుండానే శ్రీకాంత్ కు మరో చాన్స్ ఇచ్చాడు వరుణ్ అంటూ వార్తలు వస్తున్నాయి.
యస్.. ప్రస్తుతం ‘బాక్సర్’ అనే సినిమాకు ప్రిపేర్ అవుతున్నాడు వరుణ్ తేజ్. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతోంది. విశేషం ఏంటంటే.. వరుణ్ తేజ్ కు సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి మంచి కథలే చెప్పారట. కానీ అతను మాత్రం శ్రీకాంత్ ను ప్రిఫర్ చేస్తున్నట్టు భోగట్టా. తనను పరిచయం చేశాడు అనే కన్సర్న్ తో పాటు అతను చెప్పిన ఫ్యామిలీ డ్రామా వరుణ్ కు ఎక్కువగా నచ్చిందట. అంటే గద్దలకొండ గణేష్, ఇప్పుడు బాక్సర్ సినిమాలు కాస్త మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్స్. తర్వాత ఓ ఫ్యామిలీ డ్రామా చేస్తే తనకూ ఆడియన్స్ కూ రిఫ్రెష్ గా ఉంటుందనేది వరుణ్ భావన అంటున్నారు. మొత్తంగా ఇది శ్రీకాంత్ అడ్డాలకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

Varun Tej To Team Up With Srikanth Addala Again,Srikanth Addala,Varun TejVenkatesh,Narappa,Mukundha,Pooja Hegde,Boxer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *