వెంకీ మామ రిలీజ్ డేట్

Venky Mama release Date

వెంకీ మామ వచ్చేస్తున్నాడు. దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వెంకీ మామ. భారీ ముల్టీస్టారర్ గా వస్తున్నా ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. అటు నాగచైతన్య సరసన రాశి కన్నా నటిస్తుంది. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఫ్యాన్స్ కు తీపి కబురు అందించింది చిత్ర యూనిట్. ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలకు సిద్ధమౌతోంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం థమన్ సంగీతం పరంగా మంచి జోష్ లో ఉన్నాడు. అయన మ్యూజిక్ అందించిన చిత్రాలన్నీ వరుస హిట్లు అవుతుండటమే కాకుండా, ఇటీవల వచ్చిన థమన్ పాటలు పాపులర్ అయ్యాయి. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నమోదయ్యాయి. మరొక విషయం ఏంటంటే వెంకటేష్ చైతు నిజ జీవితంలోనూ మామ అల్లుళ్ళు కావడం విశేషం.

Venky Mama release Date,Venkatesh’s Venky Mama,Thaman,Naga Chaitanya,Rashi Kannah,Payal Rajput,Tollywood News,Multistarred movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *