మెగా కుర్రాడు మరో సినిమాకు ఓకే చేశాడా..?

viashnav tej amother movie

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలున్నారు. త్వరలోన ఇది క్రికెట్ టీమ్ రేంజ్ లో మారబోతోందని అంతా ఊహిస్తున్నారు. చిరంజీవి తమ్ముళ్లు, తనయులే కాదు.. అల్లుళ్లు, మేనల్లుళ్లు కూడా హీరోలవుతున్నారు. వారికి కూడా ఫ్యాన్స్ నుంచి ఆదరణ కనిపిస్తుండటంతో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా హీరో అవుతాం అంటే చాలు.. వెంటనే రంగంలోకి దించేస్తోంది. త్వరలో నిహారికకు కాబోయే భర్తను కూడా హీరోగా చూస్తే ఆశ్చర్యమేం లేదంటున్నారు. ఈ క్రమంలో చివరగా హీరో అయిన కుర్రాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో పరిచయం అవుతున్నాడు. బుచ్చిబాబు అనే కొత్త కుర్రాడు దర్శకుడుగా పరిచయం అవుతోన్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మామూలుగా ఏప్రిల్ 2న విడుదల కావాల్సిఉంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం థియేటర్స్ లేవు. అందువల్ల ఓటిటిలో విడుదలవుతుందనే రూమర్స్ వినిపించినా.. వీళ్లు మాత్రం థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ ఆగాలనుకుంటున్నారట. ఇక ఈసినిమా విడుదల కాకుండానే వైష్ణవ్ తేజ్ మరో ప్రాజెక్ట్ కు ఆరెంజ్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు.

ఆరెంజ్ సిగ్నల్ అంటే అతనికి నచ్చింది. ఇక చిరంజీవికి కూడా నచ్చితే ఆ లైట్ గ్రీన్ లైట్ గా మారుతుంది. లేదంటే రెడ్ లైట్ పడుతుంది. అంటే నిర్ణయం వైష్ణవ్ చేతిలో లేదన్నమాట. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కూడా కొత్త కుర్రాడే దర్శకుడట. ఈ స్టోరీని వైష్ణవ్ తో పాటు సాయితేజ్ కూడా విన్నాడంటున్నారు. అన్నదమ్ములిద్దరికీ బాగా నచ్చిందట. దీంతో సదరు దర్శకుడు కావాలనుకుంటోన్న కుర్రాడిని మెగాస్టార్ ను కలిసే ఏర్పాట్లు చేస్తున్నారట. ‘మామయ్య’ కూడా కథ విని నచ్చితే ఓకే అవుతుంది. ఏవైనా మార్పులు ఉన్నా చిరంజీవి చెబుతాడు. అందువల్ల ఆ కథ చెప్పే కుర్రాడు కాస్త జాగ్రత్తగా ఉంటే వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కన్ఫార్మ్ అవుతుందన్నమాట.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *