60 లక్షల వీడియోలను డిలీట్ చేసిన టిక్ టాక్

Sensational news 60 Lacks videos were Deleted by Tik tok

పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ యాప్ టిక్ టాక్ . ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఈ యాప్ మరీ ముఖ్యంగా యూత్ ని తెగ అట్రాక్ట్ చేసింది. ఎంతగా పాపులర్ అయిందో, అంతే వివాదాస్పదమైంది కూడా . మ్యాటర్ ఎంతవరకు వెళ్లిందంటే.. ఏకంగా టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. టిక్ టాక్ వీడియోల్లో పెరిగిన అశ్లీలత, బూతు కంటెంట్ అందుకు ప్రధాన కారణం. రోజుకి రోజుకి తలనొప్పులు పెరిగిపోతుండటంతో టిక్ టాక్ దిగొచ్చింది. కీలక నిర్ణయాలు తీసుకుంది.

టిక్ టాక్ 60లక్షల వీడియోలను డిలీట్ చేసింది. భారత ప్రభుత్వం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా వీడియోలను డిలీట్ చేశామని టిక్ టాక్ చెప్పింది. 2018 జూలై నుంచి ఇప్పటివరకు ఉన్న వీడియోలను తొలగించామంది. టిక్ టిక్ యూజర్ల భద్రత, సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతేకాదు ఏజ్ లిమిట్ కూడా ఫిక్స్ చేసింది. ఇకపై 13ఏళ్లు పైబడిన వారికే టిక్ టాక్ అకౌంట్ ఇస్తారు. 13ఏళ్ల లోపు పిల్లలు టిక్ టాక్ లోకి లాగిన్ అవ్వలేరు. టిక్ టాక్ సేఫ్టీ సెంటర్ కూడా ఓపెన్ చేసింది. హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, తమిల్, కన్నడ, మలయాళీ, ఒరియా భాషల్లో దీన్ని తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *