603 క్వింటాళ్ల ఉల్లిపాయలను  సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు

Vigilance officers seized 603 quintals of onions

ఉల్లి బంగారం అయిపొయింది. విపరీతంగా ధరలు పెరుగుతుంటే  ఉల్లిపాయలకు కృత్రిమ కొరత సృష్టించి అమాంతం ధర పెంచాలని చూస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లిపాయలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది ఉల్లి వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఇందులో 47మంది ఉల్లి వ్యాపారులు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. వారిలో కొందరు మార్కెటింగ్ ఫీజ్ ఎగ్గొట్టగా.. మరికొందరు అక్రమంగా ఆనియన్స్ నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 27 లక్షల విలువ చేసే 603 క్వింటాళ్ళ ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు. అవకతవకలకు పాల్పడిన 47 మంది వ్యాపారుల్లో 37 మందికి జరిమానాలు విధించి అధికారులు నోటీసులు ఇచ్చారు. మరో 10 మంది వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నెలాఖరు వరకు హోల్‌సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వ ఉంచుకోవాలని అధికారులు హెచ్చరించారు.

tags : onion seize, vigilence officials, shortage, illegal storage, black market

అద్దె గదుల రేట్లు భారీగా  పెంచిన టీటీడీ

టీడీపీకి షాక్ ఇవ్వనున్న సాధినేని యామిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *